ఆమె చెల్లి కంటే ఈమె 'జిల్‌' అంట

ఆమె చెల్లి కంటే ఈమె 'జిల్‌' అంట

రామ్‌ హీరోగా శ్రీనివాసరెడ్డి అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో రూపొందనున్న 'శివమ్‌' చిత్రంలో హీరోయిన్‌గా నేహా శర్మ చెల్లెలు ఐషా శర్మ ఎంపికైందనే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొత్త హీరోయిన్‌తో కంటే ఆల్రెడీ పేరున్న హీరోయిన్‌ ఉంటే మంచిదని భావించి ఆమెకి బదులుగా రాశి ఖన్నాని తీసుకున్నారని టాక్‌ వినిపిస్తోంది. ఈమధ్యే జిల్‌ చిత్రంలో తన అందాల ప్రదర్శనతో అదరగొట్టిన ఈ బొద్దు గుమ్మ త్వరలో రవితేజతో బెంగాల్‌ టైగర్‌లో కనిపించనుంది.

ఇప్పుడు రామ్‌ సినిమా అంటే ఇది కూడా ఆమె కెరియర్‌లో చెప్పుకోతగ్గ చిత్రమే అవుతుంది. ఈ చిత్రాన్ని ముందుగా నితిన్‌తో చేద్దామని మొదలు పెట్టిన శ్రీనివాసరెడ్డి అతనితో అభిప్రాయభేదాలు రావడంతో రామ్‌ని అప్రోచ్‌ అయ్యాడు. అప్పట్లో కథానాయికగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ని తీసుకున్నారు. మళ్లీ ఆమెనే తీసుకోవాలని దర్శకుడు భావించినా కానీ 'పండగ చేస్కో'లో రామ్‌తో నటించేసింది కాబట్టి ఫ్రెష్‌ కాంబినేషన్‌ కోసమని రాశి ఖన్నాని తీసుకున్నారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English