సిని'మా' వాళ్లకి కొత్త తలనొప్పి

సిని'మా' వాళ్లకి కొత్త తలనొప్పి

'మా' అధ్యక్ష ఎన్నికలు ముగిసినా రాజకీయాలు తగ్గలేదట. సీనియర్‌ నటుడు నరేష్‌కీ, 'మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌కీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. 'మా' అసోసియేషన్‌కి అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ అయితే, నరేష్‌ కూడా అందులో కీలక పదవిలోనే ఉన్నాడు. రాజేంద్రప్రసాద్‌ ప్యానల్‌లో తక్కువమందే ఉండగా, ప్రత్యర్థి ప్యానల్‌లో ఎక్కువమంది ఉన్నారు. వాళ్ళంతా రాజేంద్రప్రసాద్‌కి యాంటీగా వ్యవహరించనున్నారనే సంకేతాలయితే బయటకు వచ్చాయి. వీటి పట్ల రాజేంద్రప్రసాద్‌ చాలా ఇబ్బందిగా ఫీలవుతున్నాడట.

ఇండస్ట్రీకి ఏదో చేసేద్దామని రాజేంద్రప్రసాద్‌ అనుకుంటుంటే, ఆయన్ని ఏమీ చేయనివ్వటంలేదంటూ కొందరు కొత్త ప్రచారానికి తెరలేపారు. రంగంలోకి దిగిన కొందరు సినీ పెద్దలు 'మా' అసోసియేషన్‌లో కీలక పదవుల్లో ఉన్నవారితో విడివిడిగా సమావేశాలు కూడా జరుపుతున్నారట. ఎన్నికల రాజకీయంతో 'మా' పరువు పోయిందనీ, ఇకనైనా రాజకీయాలు మానాలని సినీ పెద్దలు సూచిస్తున్నా, వారి మాటల్ని లెక్కచేసే పరిస్థితుల్లో ఎవరూ కనిపించడంలేదు. ఈ కొత్త తలనొప్పి సిని'మా' వాళ్ల పరువుని ఇంకా బజార్న పడేస్తుందనే ఆవేదన అందరిలోనూ వ్యక్తమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు