రఫ్‌ లుక్కుతో ఎన్టీఆర్‌ హంగామా

రఫ్‌ లుక్కుతో ఎన్టీఆర్‌ హంగామా

త్వరలో రానున్న 'రామయ్య వస్తావయ్యా' సినిమా కోసం యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కొత్త లుక్కుతో హంగామా చెయ్యనున్నాడా అంటే అవుననే అంటున్నారు సన్నిహితులు. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో రాబోయే ఈ పవర్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌లో స్టూడెంట్‌ లీడర్‌ పాత్రలో మెరవనున్నాడు జూనియర్‌.

అయితే ఈ సినిమా కోసం ప్రస్తుతం మెయిన్‌టైన్‌ చేస్తున్న సాఫ్ట్‌ లుక్‌ను వదిలేసి, కొంత ఎపిసోడ్‌ కోసం గెడ్డంతో కనిపించే ఒక రఫ్‌ లుక్‌ని ప్రయత్నిస్తున్నాడట. రీసెంట్‌ మనోడు పార్లమెంటు ఆవరణలో జరిగిన ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణకు ఇదే లుక్‌లో దర్శనమివ్వడం గమనార్హం. మొన్ననే బాద్షాలో కొత్త హెయిర్‌ స్టయిల్‌తో హడావుడి చేసిన ఎన్టీఆర్‌, ఇప్పుడిలా కొత్త గెడ్డంతో చాలా డిఫరెంట్‌గా ఉన్నాడంటూ కేరింతలు కొడుతున్నారు నందమూరి అభిమానులు.

ఒకవేళ రామయ్య వస్తావయ్యా కూడా బాద్షా రేంజ్‌ హిట్టయితే, మనోడికి అందని ద్రాక్షలా ఉన్న ఆ నెంబర్‌ వన్‌ కిరీటం కాస్త దగ్గరగా వస్తుంది. చూద్దాం గబ్బర్‌ సింగ్‌ ఊపులో ఉన్న హరీశ్‌ శంకర్‌, ఎన్టీఆర్‌కు ఎటువంటి హిట్టిస్తాడో...

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు