మెగా ఫ్యాన్స్‌కు 'వాడకం' చూపిస్తున్నారు

మెగా ఫ్యాన్స్‌కు 'వాడకం' చూపిస్తున్నారు

దూకుడు సినిమాలో.... నన్ను వాడుకోండయ్యా... మా వాడకం ఎలా ఉంటుంది రేపటి నుండి చూపిస్తాం.. ఈ టాలెంట్‌నే కాదు ఆ టైమింగ్‌ను కూడా మొత్తం పిండేసుకుంటాం!! ఈ డైలాగులన్నీ గుర్తొచ్చాయా. సరిగ్గా ఇప్పుడు మహేష్‌బాబు బ్రహ్మానందంను వాడుకున్నట్లే, చాలామంది చిన్న హీరోలు మెగా ఫ్యాన్స్‌ను వాడేసుకుంటున్నారు.

వరుసగా రెండు సినిమాల కోసం పవన్‌ జపం చేస్తూ మెగా ఫ్యాన్స్‌ను ఉపయోగించుకొని భారీ ఓపెనింగ్స్‌ను కొల్లగొట్టాడు నితిన్‌. ఇప్పుడు ఇదే బాటలో నడుస్తున్నాడు సాయికుమార్‌ కొడుకు ఆది. సుకుమారుడు సినిమాలో చేసిన డ్యాన్సులకు ప్రేరణ మెగాస్టార్‌ చిరంజీవేనని చెబుతూ మెగా ఫ్యాన్స్‌ను తెగ మోసేస్తున్నాడు.

తన డ్యాన్సులు, ఫైట్లు చూసి మెగా అభిమానులు థ్రిల్లింగ్గా ఫీలవ్వుతారని చెబుతూనే, పరోక్షంగా వారిని మొదటిరోజునే సినిమా చూడాలని ఆహ్వానిస్తున్నాడు. ఈ లెక్కన చూస్తే రాబోయే ప్రతీ చిన్న హీరో చిరు ఫోటోనో, పవన్‌ ఫోటోనో పెట్టేసుకుని మెగా అభిమానులను ఓపెనింగ్‌ కలెక్షన్ల కోసం బాగా వాడేసుకుంటారనమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు