నిత్య అతని కంట్లో పడిందండోయ్‌

నిత్య అతని కంట్లో పడిందండోయ్‌

హీరోయిన్లని అందంగా ప్రెజెంట్‌ చేయడంలో గౌతమ్‌ మీనన్‌కి సాటి రాగల వారు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదేమో. హీరోయిన్లతో ఎక్స్‌పోజింగ్‌ చేయించి, అందాల ప్రదర్శనతో ఆకట్టుకునే దర్శకులు చాలామందే ఉన్నారు. కానీ కాటన్‌ శారీలు కట్టించి, చూడగానే 'అబ్బ ఎంత బాగుందో' అని ఎవరిని చూసినా అనుకునేలా చేసేది మాత్రం గౌతమ్‌ మీనన్‌ ఒక్కడే. అసలు అతనే పరిచయం చేయకపోతే సమంత అంతటి స్టార్‌ అయి ఉండేది కాదేమో. ఏదైనా మామూలు గ్లామర్‌ క్యారెక్టర్‌ చేసి పరిచయమై ఉంటే ఆమెనసలు పట్టించుకునేవారే కాదేమో. ఏమాయ చేసావె అంటూ అతను చూపించిన జెస్సీనే సమంత రాత మార్చేసింది.

ఈ దర్శకుడి కంట్లో ఇప్పుడు నిత్యామీనన్‌ పడింది. ఓకే బంగారం చూసి అతను నిత్య జపం చేస్తున్నాడు. ఎంత అందంగా ఉందో, ఎంత గొప్పగా నటించిందో అంటూ పొగిడేసాడు. ఆమె ఉన్న ప్రతి ఫ్రేమ్‌ తనని వెంటాడుతోందని కూడా అన్నాడు. ఇంతగా ఇంప్రెస్‌ అయ్యాడంటే త్వరలోనే గౌతమ్‌ మీనన్‌ డైరెక్షన్‌లో నిత్యామీనన్‌ నటించడం ఖాయం చేసుకోవచ్చు. అదే జరిగితే ఇక నిత్య అభిమానులకి కనుల విందే!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు