అత్తారింటి దారేది.. మాటలతో మాయ!

అత్తారింటి దారేది.. మాటలతో మాయ!

అమ్మడి ‘మాట’లు కోటలు దాటుతున్నాయి. కోట దాటించేయడమే కాదు... అదే మాటతో ఆకర్ష మంత్రం వేస్తోంది. ఏకంగా మాయ మాటలతో హీరో, దర్శకుల్ని కూడా బుట్టలో వేసేస్తోంది. అయితే ఇవన్నీ సదరు దర్శకుడినుంచి నేర్చుకున్నవేనట. ఎవరినుంచైతే ఆ మాటలు నేర్చిందో.. అతగాడికే తిరిగి అవి అప్పజెప్పేస్తోంది. ఈ సీనులో అమ్మడి పేరు సమంత. దర్శకుడు త్రివిక్రవ్‌ు. హీరో పవన్‌కళ్యాణ్‌.

మొన్నటి దాకా పవన్‌ సూపరు..డూపరు అంటూ పొగిడేసిన సమంత ఇప్పుడు ఏకంగా మాటల మరాఠీ త్రివిక్రవ్‌ుకే మాటలు నేర్పేస్తోంది. మీ సినిమా ‘అత్తారింటికి దారేది’కి ‘మాటలతో మాయ’ అనే ట్యాగ్‌లైన్‌ పెట్టుకోమంటూ సూచించేసింది ఈ సెక్సిణి. పంచ్‌లతో పటాయించే మాయావిగా పేరున్న త్రివిక్రవ్‌ుకే ఈ సూచన చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

 తెలుగు నేర్చేసుకుని..తెలుగులో ట్యాగ్‌లు పెట్టే స్థాయికి ఎదిగేసిందిట సమంత. ఇది విని పవన్‌ అభిమానులు సైతం అబ్బో అనుకుంటున్నారు. అమ్మడి బుట్టలో పడిపోతున్నారు.  ఇంతకీ త్రివిక్రవ్‌ు సమంత చెప్పిన ట్యాగ్‌లైన్‌ని ఎలా వాడుకుంటాడో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు