దగ్గుబాటి రాణాకి అంతుందా?

దగ్గుబాటి రాణాకి అంతుందా?

మోస్ట్‌ డిజైరబుల్‌ తెలుగు మ్యాన్‌గా టాప్‌ ప్లేస్‌లో నిలిచిన రానా దగ్గుబాటి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసాడు. మహేష్‌బాబుని రెండవ స్థానంలోకి నెట్టి తను టాప్‌ ప్లేస్‌ దక్కించుకోవడం షాకిచ్చింది. గత ఏడాది కాలంలో రానా కెరియర్‌ పరంగా పెద్దగా సాధించిందేమీ లేదు. ఇదే పోల్‌ బాహుబలి తర్వాత జరిగి ఉన్నట్టయితే రానా టాప్‌ ప్లేస్‌కి జస్టిఫికేషన్‌ జరిగి ఉండేదేమో. అసలు టైమ్స్‌ పత్రిక ఈ పోల్‌ ఏ ప్రాతిపదికన చేస్తుందో, ఎవరు ఓట్‌ చేస్తారో, ఎంతమంది ఓట్‌ చేస్తారో అనేది తెలీదు. దాంతో ఈ పోల్‌ క్రెడిబులిటీని కొందరు క్వశ్చన్‌ చేస్తున్నారు.

అయితే పోల్‌ నిర్వహించామని చెబుతోన్న టైమ్స్‌ పత్రిక కిరీటాన్ని ఈ కండల వీరుడికే కట్టబెట్టింది. కాబట్టి ఎవరు అవునన్నా కాదన్నా ఈ ఏడాదికి రానానే మోస్ట్‌ డిజైరబుల్‌ అని తేలిపోయింది. ఇక బాహుబలి, రుద్రమదేవి చిత్రాలు రిలీజ్‌ అయిన తర్వాత రానా పాపులారిటీ ఇంకా పెరిగి, స్టార్‌గా ఎదిగితే అప్పుడిక తనని దాటి మోస్ట్‌ డిజైరబుల్‌ అనిపించుకోవడం కష్టమే మరి. ఎందుకంటే తను మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ కూడా కదా!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English