పొగడ్తలతో అతడిని పడేయాలని చూస్తోంది!

పొగడ్తలతో అతడిని పడేయాలని చూస్తోంది!

రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఇప్పుడు హీరోయిన్లకు ఒక ప్రత్యక్ష దైవంగా కనిపిస్తున్నాడు. అతడి చల్లని చూపు తమ మీద పడితే ఒకేసారి బాలీవుడ్ లో, కోలీవుడ్ లో పాగా వేయవచ్చని వారు ఆశిస్తున్నారు. 'రంజానా' సినిమాతో సూపర్ సక్సెస్ కొట్టిన ధనుష్ మీద హీరోయిన్లకు క్రేజ్ రెట్టింపు అయ్యింది. అతడిని మంచి చేసుకుంటే అవకాశాలు లభిస్తాయని వారు ఆశిస్తున్నారు.

 అందుకోసం ధనుష్ ను పొగడటమే మార్గమని వారు భావిస్తున్నారు. ఈ విషయంలో తమన్నా మరీ ముదురులా కనిపిస్తోంది. ఇప్పుడు మీడియా కనిపిస్తే చాలు తమన్నా ధనుష్ ను పొగడటం స్టార్ట్ చేస్తోంది. వెనుకా ముందు చూసుకోకుండా... ధనుష్ యాక్షన్ అద్భుతమని, ఆయన స్టోరీ సెలక్షన్ కేక అని, తాను ఆయన అభిమానిగా మారానని  ఎడా పెడా తమన్నా పొగడ్తల వర్షం కురిపిస్తోంది.

తమన్నా ఇలా ఎందుకు పొగుడుతోందో తమకు అందరికీ అర్థమయ్యే వ్యవహారమే! అటు బాలీవుడ్ ప్రయోగం బోల్తాపడి, ఇటు సౌత్ లోనూ సరైన అవకాశాలు లేని ఆమె ఎవరో ఒకరిని కాకపట్టి అవకాశాలు సంపాదించుకోవాలని చూస్తోంది. అందుకోసం ధనుష్ కు పొగడ్తల గేలం వేస్తోంది. మరి దీనికి అతడు పడతాడో పడడో! తమన్నా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English