బయ్యర్లు ఎగబడిపోతున్నారు

బయ్యర్లు ఎగబడిపోతున్నారు

లారెన్స్‌కి మాస్‌లో ఉన్న గ్రిప్‌ ఏంటనేది అతని చిత్రాలకి వచ్చిన వసూళ్లే చెప్తాయి. ముఖ్యంగా ముని సిరీస్‌ ఇక్కడ బ్రహ్మాండంగా సక్సెస్‌ అయింది. హారర్‌ కామెడీ చిత్రాలకి ఉన్న డిమాండ్‌ ఏంటనేది కాంచన సినిమానే ప్రూవ్‌ చేసి కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత ఆ జానర్‌లో వచ్చిన సినిమాలన్నీ పెద్ద హిట్‌ అయ్యాయి. లారెన్స్‌ దర్శకత్వంలో అతనే హీరోగా రూపొందిన 'గంగ' అలియాస్‌ 'ముని 3' చిత్రం వచ్చే శుక్రవారం రిలీజ్‌ అవుతోంది. నిర్మాణంలో చాలా జాప్యం జరిగినా కానీ ఈ చిత్రంపై ఉన్న నమ్మకంతో దీనిని బయ్యర్లు ఎగబడి కొనేస్తున్నారు.

కేవలం తెలుగులోనే కాదు, తమిళంలో కూడా ఈ చిత్రానికి డిమాండ్‌ అలాగే ఉంది. స్టార్స్‌ ఎవరూ లేకపోయినా కానీ ఈ చిత్రాన్ని పెద్ద రేట్లకి కొంటున్నారంటే లారెన్స్‌పై ఉన్న నమ్మకమే కారణం. ఈ చిత్రం తప్పకుండా మాస్‌ని విపరీతంగా ఆకట్టుకుంటుందని, కాంచన కంటే పెద్ద హిట్‌ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో తాప్సీ, నిత్యమీనన్‌ కథానాయికలుగా నటించారు. ఇటీవలే రిలీజ్‌ చేసిన ట్రెయిలర్‌తో దీనిపై నమ్మకం ఇంకాస్త పెరిగింది. బాక్సాఫీస్‌ వద్ద ఈ హారర్‌ కామెడీ ఎంత సందడి చేస్తుందో, ఎన్ని కోట్లు కొల్లగొడుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు