పవర్ స్టార్ తీరే వేరు!

పవర్ స్టార్ తీరే వేరు!

ఎదుటివాళ్ల సమస్యల్ని అర్థం చేసుకోవడంలో పవన్ తర్వాతే ఎవరైనా. మొన్నటికి మొన్న ఉత్తరాఖండ్ బాధితుల కష్టాలు చూసి కదిలిపోయాడు. వెంటనే ఇరవై నాలుగు లక్షలు విరాళమిచ్చాడు. ఇప్పుడో... ఓ నిర్మాత కష్టాన్ని తీర్చడం కోసం ఏకంగా తన సినిమా ఆడియో రిలీజ్ నే క్యాన్సిల్ చేసి పారేశాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ నటిస్తోన్న అత్తారింటికి దారేది చిత్రం ఆడియోకు రంగం సిద్ధమైంది. గ్రాండ్ గా చేయాలని డిసైడ్ చేశారు కూడా. కానీ చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ వద్దన్నాడు. అనవసరంగా డబ్బు దండగ, ఎందుకివన్నీ, క్యాన్సిల్ చేయండి అన్నాడు.

దానికి కారణం ఏంటో తెలుసా... నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ కష్టాల్లో ఉండటం. ఆత్తారింటికి దారేది చిత్రంతో పాటు, గోపీచంద్ తో సాహసం చిత్రాన్ని కూడా నిర్మించాడు ప్రసాద్. అయితే సాహసం రిలీజుకు చాలా అడ్డంకులు వచ్చాయి. గోపీచంద్ కి మార్కెట్ లేకపోవడంతో సినిమాని కొనడానికి బయ్యర్లు అంతగా ముందుకు రావడం లేదు. దాంతో ప్రసాద్ కష్టాలు ఎక్కువయ్యాయి. మొత్తానికి ఈ నెల 21న సినిమాని విడుదల చేయాలని తంటాలూ పడుతున్నాడు. అతడి కష్టాన్ని గమనించిన పవన్ కళ్యాణ్... సాహసం ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాలని డిసైడ్ చేసుకున్నాడు.

 అందు కోసమే తన సినిమా ఆడియో విడుదలను రద్దు చేయించాడు. ఆ సమయంలో సాహసం సినిమాని ప్రమోట్ చేస్తానని ప్రసాద్ కి మాటిచ్చాడు. మంచి మనసుకి ఇంత కన్నా నిదర్శనం ఏం కావాలి! ఆడియో వేడుకను పెళ్లి కంటే ఘనంగా చేయాలని హీరోలంతా పట్టు పడుతున్న సమయంలో, దాన్ని కాదనుకుని వేరే సినిమా కోసం సాయపడటం పవన్ తప్ప ఎవరూ చేయలేరేమో. హ్యాట్సాఫ్ పవర్ స్టార్!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు