రాశీ ఖన్నాకి అదొక్కటే మైనస్‌

రాశీ ఖన్నాకి అదొక్కటే మైనస్‌

ఫేస్‌లో కావాల్సినంత క్యూట్‌నెస్‌ ఉన్నా, ఒంట్లో అవసరానికి మించి 'కండ' ఉండటమొక్కటీ రాశీ ఖన్నాకి మైనస్‌ పాయింట్‌. 'జిల్‌' సినిమాతో పెద్ద హిట్‌ కొట్టిన రాశి ఖన్నాకి టాలీవుడ్‌ నుంచి ఆఫర్లు సునామీలా వచ్చిపడుతున్నాయట. తెలుగు సినీ ఇండస్ట్రీలో బాగా బిజీ అయిపోయిన హీరోయిన్లలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంటే, ఆ తర్వాతి స్థానంలోకి రాశి ఖన్నా వచ్చేసిందంటున్నారు. స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ ఇంకా రాశి ఖన్నాకి దక్కకపోయినా, 'జిల్‌' కమర్షియల్‌ హిట్‌ ఆమెను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది.

గోపీచంద్‌ పక్కన క్యూట్‌ క్యూట్‌గా కనిపించి ఆడియన్స్‌ని ఆకట్టుకున్నా, యంగ్‌ జనరేషన్‌ హీరోస్‌ పక్కన మరీ మోటుగా ఉండటం రాశి ఖన్నాకి పెద్ద మైనస్‌. దాన్ని అధిగమించాలంటే, సన్నబడటం మీద ఆమె ఇంకా ఎక్కువ ఫోకస్‌ పెట్టాల్సి ఉంటుంది. తొలి సినిమా 'ఊహలు గుసగుసలాడే'తో పోల్చి చూసినప్పుడు 'జిల్‌'లోని రాశి ఖన్నా స్లిమ్‌గానే కనిపిస్తుంది. కానీ, అది సరిపోదు. సక్సెస్‌ ఇచ్చిన కిక్‌ కొనసాగించాలంటే రాశి ఖన్నా బాగా ఒళ్లొంచాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు