ఇలా గాలి తీసేసాడేంటి?

ఇలా గాలి తీసేసాడేంటి?

రవిబాబుతో సినిమా అంటే ఏసీ, డీసీ అనేది చాలా సార్లు రుజువైంది. ఎప్పుడు అవునులాంటి సర్‌ప్రైజ్‌ హిట్‌ ఇస్తాడో, ఎప్పుడు లడ్డుబాబులాంటి సినిమాతో దాడి చేస్తాడో చెప్పలేం. అతని సినిమాలపై రిలీజ్‌కి ముందు ఎలాంటి అంచనాలు ఏర్పడకపోయినా మొదటిసారి అవును 2 మాత్రం బాగుంటుందని చాలా మంది ఆశించారు. దీనిని తప్పక చూడాలని భావించారు. అయితే రవిబాబు మరోసారి తనదైన శైలిలో గాలి తీసేసాడు. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న పూర్ణ, హర్షవర్ధన్‌ రాణే ఇప్పుడు మళ్లీ రవిబాబే ఏదైనా ఛాన్స్‌ ఇస్తాడని ఎదురు చూడాలి.

అవును చిత్రం నచ్చి అవును 2పై పెట్టుబడి పెట్టిన సురేష్‌బాబుకి కూడా రవిబాబు షాకిచ్చాడు. కేవలం అవును సినిమాకి వచ్చిన క్రేజ్‌ని క్యాష్‌ చేసుకునే ప్రయత్నమే తప్ప సినిమాలో విషయం లేదని విమర్శకులు తేల్చి పారేసారు. ఇలాంటి టాక్‌తో ఈ చిత్రం బతికి బట్ట కట్టడం కష్టమే. అసలే వచ్చే వారంలో సన్నాఫ్‌ సత్యమూర్తి వస్తున్నాడు. ఇప్పుడేమో ఆల్రెడీ మార్కెట్‌లో జిల్‌ ఉంది. బాగుంటే ఈ సినిమాకి ఉన్న క్రేజ్‌కి చాలా పెద్ద రేంజ్‌కి వెళ్లి ఉండేది కానీ ఇప్పుడు పెట్టుబడి రాబట్టుకుంటే విశేషమే అనేది ట్రేడ్‌ వర్గాల మాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English