ఎక్స్‌పోజింగ్‌ డబుల్‌ డోస్‌ ఉంటుందట

ఎక్స్‌పోజింగ్‌ డబుల్‌ డోస్‌ ఉంటుందట

జూనియర్‌ అసిన్‌ అనిపించుకున్న 'అవును' ఫేం పూర్ణకి తెలుగులో హీరోయిన్‌గా నిలదొక్కుకోవాలని ఆశ. ఏ హీరోయిన్‌ అయినా స్టార్‌ స్టేటస్‌ దక్కించుకోవాలనే అనుకుంటుంది. పూర్ణ కూడా చాలా కాలంగా ఆ కలలు కంటోంది. రవిబాబు డైరెక్షన్‌లో వచ్చిన 'అవును' సినిమాలో నటించిన పూర్ణ ఆ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న 'అవును-2' సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. రొటీన్‌కి భిన్నంగా సినిమాలు చేసే రవిబాబు, 'అవును' సిరీస్‌లో రెండో సినిమాని ఆడియన్స్‌ ముందుకు తీసుకొస్తున్నాడు. సీక్వెల్‌లో కూడా పూర్ణకే ఛాన్స్‌ ఇవ్వడంతో రవిబాబుకీ, పూర్ణకీ మధ్య ఏదో ఉందన్న పుకార్లు వచ్చాయి.

ఈ పుకార్లు పూర్ణకి కొంచెం పబ్లిసిటీని తెచ్చిపెట్టాయి. కానీ స్టార్‌ హీరో సినిమాలో నటిస్తేనే ఏ హీరోయిన్‌కి అయినా గుర్తింపు ఉంటుంది. అల్లరి నరేష్‌తో 'సీమటపాకాయ్‌', 'లడ్డూబాబు' సినిమాల్లో నటించిన పూర్ణకి, అంతకన్నా పెద్ద హీరోలతో నటించే ఛాన్స్‌ మాత్రం రావడంలేదు. ఆ ప్రమోషన్‌ 'అవును 2'తో వస్తుందని ఆశిస్తున్న పూర్ణ కోరిక నెరవేరుతుందేమో చూడాలి. అవును ఫస్ట్‌ పార్ట్‌లో కథానుసారం అందాల ప్రదర్శన చేసి ఆ చిత్ర విజయంలో తనదైన పాత్ర పోషించిన పూర్ణ అవును2లో అంత కంటే ఎక్కువే చేసిందట. 'అవును 2' అంటే హారర్‌ ఎఫెక్టుల కోసమే కాదు... పూర్ణ ఇచ్చే ఐ ఫీస్ట్‌ కోసం కాచుక్కూర్చున వాళ్లూ ఉన్నారు మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు