అలా చేస్తే.. హీరోయిన్‌తో డైరెక్టర్‌కి లింకున్నట్టే!

అలా చేస్తే.. హీరోయిన్‌తో డైరెక్టర్‌కి లింకున్నట్టే!

ఒక హీరోయిన్‌ని తన తదుపరి చిత్రంలో కూడా ఒక దర్శకుడు రిపీట్‌ చేసాడనుకోండి. వెంటనే ఆ దర్శకుడికీ, హీరోయిన్‌కీ ఏదో ఉందని అంటగట్టేస్తున్నారు. ఇది పాపం చిన్న హీరోయిన్లు, చిన్న దర్శకులకే తప్ప పెద్ద వారికి వర్తించదు. పెద్దవాళ్లు చేస్తే, అది సెంటిమెంట్‌ ప్రకారం.. కాంబినేషన్‌ క్రేజ్‌ కోసం చేసినట్టు. అదే చిన్న దర్శకులు కనుక హీరోయిన్‌ని రిపీట్‌ చేస్తే ఆమెతో అతనికి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టు!

ఇదే లాజిక్‌ పాటిస్తున్నాయి కొన్ని గాసిప్‌ వెబ్‌సైట్లు. ఆ లాజిక్‌ ప్రకారం ఇంద్రగంటి మోహనకృష్ణ, ఈష గురించి చిలవలు పలవలుగా రాసేస్తున్నారు. 'అంతకుముందు ఆ తరువాత', 'బందిపోటు' చిత్రాల్లో ఈషని తీసుకున్నాడనేది ఈ గాసిప్‌ పుట్టకకి ఆధారం. అలాగే అవును తర్వాత అవును 2 చిత్రాన్ని పూర్ణతో చేసిన రవిబాబుకి కూడా సేమ్‌ లాజిక్‌ అప్లయ్‌ చేసారు. అలా అయితే భూమికతో కూడా తాను వరుసగా మూడు సినిమాలు చేసానని, మరి అప్పుడెందుకు ఏం మాట్లాడలేదని గట్టిగానే తగులుకున్నాడు రవిబాబు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English