పెద్దోళ్లపై కన్నేసిన రాశి ఖన్నా

పెద్దోళ్లపై కన్నేసిన రాశి ఖన్నా

'జిల్‌' సినిమాతో రాశి ఖన్నా ఇండస్ట్రీలో పాపులర్‌ అయిపోయింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతోనే ఆకట్టుకున్న రాశి ఖన్నాకి జిల్‌తో పెద్ద స్టేజ్‌ లభించింది. వచ్చిన ఆపర్చునిటీని అటు గ్లామర్‌తో, ఇటు పర్‌ఫార్మెన్స్‌తో ఫుల్‌గా వాడేసుకున్న రాశి ఖన్నాపై ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దల దృష్టి పడింది. కాకపోతే ఇంకా ఆమె దిశగా పెద్ద ఆఫర్లేం రాలేదు. బెంగాల్‌ టైగర్‌లో తప్ప ఇక ఏ చిత్రంలోను ఆమె నటించడం లేదు. మొదట్లో చిన్న సినిమాలే చేసినా కానీ ఇకపై అలాంటివి వద్దనుకుంటోంది రాశి ఖన్నా. కేవలం పెద్ద స్టార్స్‌నుంచి పిలుపు వస్తేనే చేయాలని అనుకుంటోంది.

ఏ పెద్ద సినిమాలో అయినా ఆఫర్‌ వచ్చేసరికి తన డేట్స్‌ ఖాళీ లేకపోతే ఇబ్బందులు వస్తాయని ఇతర ఆఫర్లని కూడా తిరస్కరిస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్స్‌కి షార్టేజీ ఉందని రాశికి బాగా తెలుసు. టైమ్‌ కోసం వేచి చూస్తే తన ఛాన్స్‌ తనకి వచ్చేస్తుందని ఆమె ధీమాగా ఉంది. మరి ముందుగా రాశికి ఏ స్టార్‌ హీరోనుంచి ఎంకరేజ్‌మెంట్‌ లభిస్తుందో. ఒక్కసారి ఒక్క పెద్ద సినిమా వచ్చిందంటే మిగతావి క్యూ కట్టేస్తాయని చాలా మంది విషయంలో చూసాం కాబట్టి రాశికి ఇప్పుడు కావాల్సింది ఆ ఒక్క ఛాన్సే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు