హిట్టయితే ఇంకోటి కూడా తీస్తా

హిట్టయితే ఇంకోటి కూడా తీస్తా

'అవును' చిత్రానికి 'అవును 2' సీక్వెల్‌ కాదని... దానికి రెండవ భాగమని చెబుతున్నాడు రవిబాబు. ఆ కథ ఎక్కడ ఆగిందో అక్కడ్నుంచే ఈ చిత్రం మొదలవుతుందని, అందులో విషయం ఏంటనేది తెలీకుండా సస్పెన్స్‌ కొనసాగితే... ఈసారి మేటర్‌ ముందే తెలిసిపోయినా కానీ థ్రిల్‌కి గురి చేసే సీన్స్‌ చాలా ఉంటాయని తెలిపాడు. అవును కంటే అవును 2 చిత్రానికి ఎక్కువ కష్టపడ్డానని, ఒకసారి ప్రూవ్‌ అయిన సినిమాకి రెండవ భాగం తీయడమంటే అంచనాలుంటాయి కాబట్టి వాటిని అందుకోవడానికి కృషి చేసామని, తప్పకుండా దీనిని కూడా లైక్‌ చేస్తారని అనుకుంటున్నానని చెప్పాడు.

అవును 2 చిత్రానికి కనుక ఆదరణ బాగుంటే అవును 3 కూడా తీసే ఆలోచన ఉందని, మొదటి సినిమాలానే దీనిని కూడా ఓపెన్‌ ఎండింగ్‌తో ముగిస్తున్నట్టు తెలియజేసాడు. ఏప్రిల్‌ 3న విడుదల కాబోతున్న ఈ చిత్రంలో పూర్ణ ప్రధాన పాత్ర పోషించింది. హర్షవర్ధన్‌ రాణే ఆమెకి జోడీగా నటించాడు. అవును సినిమాకి ఉన్న బ్రాండ్‌ వేల్యూ వల్ల, అవును 2 ట్రెయిలర్‌లో ఉన్న షాక్‌ వేల్యూ వల్ల అవును 2 చిత్రానికి ఓపెనింగ్స్‌ బాగుంటాయనే అంచనాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు