మీ మొగుళ్లు నాకొద్దు.. నాకొకడున్నాడు!

మీ మొగుళ్లు నాకొద్దు.. నాకొకడున్నాడు!

ఇంత ఘాటైన స్టేట్‌మెంట్‌ ఇచ్చింది మరెవరో కాదు, బాలీవుడ్‌ని ఒక ఊపు ఊపేస్తోన్న సన్నీలియోని. పోర్న్‌ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌కి మకాం మార్చిన సన్నీ ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తూ తీరిక లేనంత బిజీగా ఉంది. అయితే బాలీవుడ్‌లో స్టార్‌ హీరోల సరసన నటించాలనే సరదా ఆమెకి తీరడం లేదు. సన్నీతో అందరూ సి గ్రేడ్‌ యాక్టర్లే చేస్తున్నారు తప్ప హీరోలు అనదగ్గ వాళ్లు ఇంట్రెస్ట్‌ చూపించడం లేదు. తనతో నటించడానికి సదరు హీరోల భార్యలు ఇష్టపడక పోవడమే కారణమని సన్నీకి తెలిసిందట. సన్నీతో నటిస్తే ఎక్కడ ఆమె తమ భర్తని ఎగరేసుకుపోతుందోనని కంగారు పడుతున్నారట.

ఇది విన్న సన్నీలియోని తనకి ఎవరి భర్తలు అక్కర్లేదని, తనకి ప్రేమించే భర్త ఒకడున్నాడని, అతడు చాలా సూపర్‌ అని, అతడిని కాదని వేరే వాడిపై మనసు పడనని భరోసా ఇస్తోంది. తనతో చేయడానికి ఆంక్షలు విధించకండని హీరోల భార్యలకి సన్నీ పిలుపునిచ్చింది. అయితే తనకి ఉన్న అడల్ట్‌ స్టార్‌ ఇమేజ్‌ కూడా సన్నీకి అడ్డు పడుతోంది. ఎంత కాదనుకున్నా ఆమెకి అదే ఐడెంటిటీ కాబట్టి ఆమెతో నటిస్తే తమ స్థాయి కూడా పడిపోయిందని అనేస్తారనే భయంతోనే పేరున్న హీరోలు సన్నీకి దూరంగా ఉంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు