సిని'మా' పొల్యూషన్‌

సిని'మా' పొల్యూషన్‌

ఆడియన్స్‌ పల్స్‌ని బట్టి చూస్తే సినిమా రంగం పొల్యూషన్‌కి గురైందట. ఆడియన్స్‌లో నడుస్తున్న టాక్‌ ఇదే. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలు సినీ తారల అంతరంగాల్ని బయటపెట్టాయి. ఓ డజను మంది సినీ ప్రముఖులు కొన్ని రోజులనుంచీ మీడియాలో కనిపిస్తూ, ఏవేవో మాట్లాడుతున్నారు. ఎవరు తప్పుగా మాట్లాడుతున్నారో, ఎవరు ఒప్పుగా మాట్లాడుతున్నారో కామన్‌ ఆడియన్స్‌కి అర్థం కాకుండా ఉండదు. నథింగ్‌ బట్‌ రాజకీయం అనేస్తున్నారు ఆడియన్స్‌. ఎలక్షన్స్‌ జరిగాయి.

500 ఓట్లు కూడా పోల్‌ అవలేనప్పుడు, ఇంత రాజకీయం చేసి ఏం లాభం పొందుతారు? అనే అనుమానం ప్రేక్షకులకు కలగకుండా ఎందుకు ఉంటుంది? రాజకీయాలపై ఇంట్రెస్ట్‌ తగ్గిపోయిన ఆడియన్స్‌కి సిని'మా' రాజకీయం కొంచెం ఇంట్రెస్ట్‌ కలిగించింది. ఎన్నికలయ్యాక అందరం కలిసే ఉంటాం అని ఇప్పటిదాకా విమర్శలు చేసుకున్న రాజేంద్రప్రసాద్‌, జయసుధ, ఈ 'మహాభారత యుద్ధానికి' కథ స్క్రీన్‌ప్లే రచించిన మురళీమోహన్‌ అనడంతో ఆశ్చర్యపోవడం ఆడియన్స్‌ వంతయ్యింది. సిని'మా' పొల్యూట్‌ అయ్యింది గురూ అని ఆడియన్స్‌ అనుకోవడానికి సినిమా రంగమే అవకాశం కల్పించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు