తెలుగు సినీ రాజకీయం వేడెక్కింది

తెలుగు సినీ రాజకీయం వేడెక్కింది

సినిమాలు వేరు, రాజకీయం వేరని సినీ రంగంలోని వారు అంటూ ఉండడం చూశాం. కానీ సినీ ప్రముఖులూ రాజకీయాలు చేస్తారు. సినీ రంగంలోనే ఎన్నో రాజకీయాలున్నాయి. సినిమా రంగంలోంచి వెళ్ళినవారు రాజకీయ రంగంలో రాణించడం, రాణించకపోవడం చూసిన సినీ ప్రేక్షకులు, సినీ రంగంలోని రాజకీయాలను చూసి షాక్‌కి గురవుతున్నారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌గా పిలవబడే 'మా' ఎన్నికలో రాజకీయాలు షాక్‌కి గురిచేసేలాగానే ఉన్నాయి. 'మా' అధ్యక్ష పదవికి రాజేంద్రప్రసాద్‌, జయసుధ పోటీ పడుతుండగా, ఇద్దరి వెనకా రాజకీయ నాయకులున్నారు. మురళీమోహన్‌ సపోర్ట్‌ జయసుధకు ఉంది.

నాగబాబు సపోర్ట్‌తో రాజేంద్రప్రసాద్‌ పోటీలో నిలిచారు. మురళీమోహన్‌ తెలుగుదేశం పార్టీ నాయకుడు. అదే తెలుగుదేశం పార్టీలో ఉన్న సినీ ప్రముఖుడు బాలకృష్ణ కూడా జయసుధకు మద్దతుగా ఉన్నారట. రాజేంద్రప్రసాద్‌ వెనక నాగబాబు ఉన్నారంటే, అన్నయ్య చిరంజీవి ఆయనకు మద్దతు పలికినట్లే. రాజకీయాల్లో ప్రతి విషయాన్నీ 'మహిళా' కోణంలో ప్రొజెక్ట్‌ చేస్తుంటారు రాజకీయ నాయకులు. ఓ సారి ఎమ్మెల్యేగా పనిచేయడంతో ఆ రాజకీయం వంటబట్టించుకున్న జయసుధ, తనను మహిళా కోటాలో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అంత ప్రతిష్టాత్మకంగా 'మా' ఎన్నికల్ని తీసుకోవడంలో ఆంతర్యమేమిటో సినిమా వారికి సైతం అంతుబట్టడంలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు