ఎంత బాగుండి ఏం లాభం!

ఎంత బాగుండి ఏం లాభం!

వరుస ఫెయిల్యూర్స్ తో చాలాకాలం గ్యాప్ వచ్చాక, పైసా సినిమాతో మళ్లీ పుంజుకోవాలని ప్రయత్నించాడు కృష్ణవంశీ. నాని హీరోగా 'పైసా'ను తెరకెక్కించాడు. మంచి కథ కుదిరింది. ఈసారి అన్ని జాగ్రత్తలూ తీసుకుని చక్కని కథనాన్ని తయారు చేసుకున్నాడు. కష్టపడి సినిమా తీశాడు. కానీ దురదృష్టం... సినిమా విడుదలకు మార్గం లేకుండా పోయింది.

ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీసిన సినిమాని కొనుక్కునేవాడే లేకపోయాడు. నిజానికి ఇది చాలామంది సినిమా అవుతుందని కొందరు అంటున్నారు. నాని యంగ్ పొలిటీషియన్ గా నటించాడిందులో. డబ్బు తప్ప మరో ప్రపంచం ఉండదతడికి. ఎప్పుడూ దాని గురించే ఆలోచన. అతని క్యారెక్టర్ గొప్పగా ఉంటుందట. మిగతా విషయాల్లో కూడా ప్రత్యేకతను చూపే ప్రయత్నం చూపాడు కేవీ.

దాదాపు ఇరవై వేల క్రిస్టల్స్ తో తయారు చేసిన కాస్ట్యూమ్ తో నానీని కాస్ట్ లీగా తయారు చేశాడు. మైఖేల్ జాక్సన్ తప్ప ఇంతవరకూ ఇలాంటి దుస్తులు ఎవరూ వేసుకోలేదట. ఇంకా చాలా విషయాల్లో చాలా స్పెషాలిటీస్ చూపించే ప్రయత్నం చేశాడు క్రియేటివ్ డైరెక్టర్. అతడు సినిమా తీస్తున్న విధానం నచ్చి నిర్మాతలు కూడా రాజీ పడకుండా ఖర్చు పెట్టారట. ఎంత చేసి ఏం లాభం! సినిమాని కొనుక్కోవడానికి ఏ ఒక్క డిస్ట్రిబ్యూటరూ ముందుకు రావడం లేదు. మరి చివరికి పైసా గతి ఏమవుతుందో!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు