చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ ఫుల్‌స్టాప్‌ పెడుతున్నారు

చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ ఫుల్‌స్టాప్‌ పెడుతున్నారు

చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ల మధ్య వ్యక్తిగతంగా ఇప్పుడెలాంటి సంబంధాలున్నాయనేది వాళ్లిద్దరికే తప్ప ఎవరికీ తెలీదు. కానీ ఈ అన్నదమ్ముల మధ్య వైరం, విబేధాలు అంటూ నిత్యం వార్తల్లో ఏదో విధంగా ఒక కొత్త టాపిక్‌ వచ్చి నలుగుతూనే ఉంది. చరణ్‌తో పవన్‌ సినిమా అనౌన్స్‌ చేయడంతో ఇక దీనికి తెర పడిపోతుందని అనుకుంటే దాసరి నారాయణరావు వచ్చి చిరంజీవిని తక్కువ చేసి, పవన్‌ని ఎక్కువ చేసి మాట్లాడి మళ్లీ కథ మొదటికి తీసుకొచ్చారు. తమ ఇద్దరి గురించి జరుగుతోన్న రభస మెగా అభిమానుల్ని కలచి వేస్తోందని గ్రహించిన మెగా బ్రదర్స్‌ దీనికి ఒకేసారి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని డిసైడ్‌ అయినట్టు తెలిసింది.

త్వరలోనే చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ ఇద్దరూ కలిసి ఒక ప్రెస్‌మీట్‌ పెట్టే ఆలోచనలో ఉన్నారట. మామూలుగా తమ గురించి ఎవరేం మాట్లాడుకున్నా స్పందించే అలవాటు లేని మెగా బ్రదర్స్‌ ఇప్పుడు ఫాన్స్‌ ఫీలింగ్స్‌ని దృష్టిలో ఉంచుకుని ఇలా స్పందించాలని అనుకుంటున్నారని సమాచారం. అధికారికంగా దీని గురించి ఇంతవరకు ఎలాంటి న్యూస్‌ లేకపోయినా కానీ పరిశ్రమ వర్గాల నుంచి మాత్రం ఇది తప్పక జరుగుతుందని ఘంటాపథంగా తెలిసింది. అదే జరిగితే ఈ మెగా రచ్చకి పర్మినెంట్‌గా మంగళం పాడేసే వీలుంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English