నితిన్‌ మళ్లీ ట్రాక్‌ తప్పేస్తున్నాడు!

నితిన్‌ మళ్లీ ట్రాక్‌ తప్పేస్తున్నాడు!

లవర్‌ బోయ్‌గా సినిమాలు చేస్తున్న టైమ్‌లో నితిన్‌ మాస్‌ సినిమాల వైపు అడుగులేసి ఫ్లాప్స్‌ చవిచూశాడు. 'ఇష్క్‌', 'గుండె జారి గల్లంతయ్యిందే' లాంటి క్లాస్‌ లవ్‌ స్టోరీస్‌తోగానీ నితిన్‌కి హిట్స్‌ రాలేదు. 'హార్ట్‌ ఎటాక్‌' అంటూ కొంచెం మాస్‌ టచ్‌ ఉన్న క్లాస్‌ లవ్‌ స్టోరీ చేయడంతో మిక్స్‌డ్‌ రిజల్ట్‌ నితిన్‌కి ఎదురయ్యింది. 'చిన్నదాన నీకోసం' సినిమా చేశాడుగానీ అది హిట్టో ఫట్టో నితిన్‌కే తెలియదు. కొంచెం ఛేంజ్‌ కోసం నితిన్‌ మాస్‌ డైరెక్టర్స్‌ వేటలో పడ్డాడంటున్నారు. హీరోగా నాలుగైదేళ్ళ క్రితం కన్నా ఇప్పుడు సేఫ్‌ పొజిషన్‌లో ఉండటంతో కొత్తగా ట్రై చెయ్యాలన్న ఆలోచనతో ఉన్న నితిన్‌ మాస్‌ సినిమా చేసి తన 'మాస్‌' సరదా తీర్చుకోవాలనుకుంటున్నాడట.

టాలీవుడ్‌లో ఎయిట్‌ ప్యాక్‌ ప్రదర్శించిన ఫస్ట్‌ హీరో నితిన్‌. లోపల ఆ ఫిజిక్‌ అలానే ఉండకపోయినా, కావాలనుకుంటే నితిన్‌ ఎప్పుడైనా ఆ ఎయిట్‌ ప్యాక్‌ సంపాదించుకోగలడు. ఐదారు మాస్‌ యాక్షన్‌ స్టోరీస్‌ ఇప్పటికే నితిన్‌ విన్నాడట. స్టోరీ ఫైనల్‌ అయితే ఎయిట్‌ ప్యాక్‌ ట్రైనింగ్‌ నితిన్‌ మొదలు పెట్టనున్నాడట. క్లాస్‌ సినిమాలతో మళ్లీ ట్రాకెక్కిన నితిన్‌ ఒక్కసారి గతం గుర్తు చేసుకుని మాస్‌ సినిమాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని అంటున్నారు అతని శ్రేయోభిలాషులు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు