ప్రొడ్యూసర్లను పోగేసుకుంటున్నారా?

ప్రొడ్యూసర్లను పోగేసుకుంటున్నారా?

ప్రస్తుతం ఇద్దరు టాలీవుడ్‌ సెలబ్రిటీలో అమెరికాలో ఫుల్‌ బిజీగా ఉన్నారు. కాస్త విషయం ఉన్న సినిమాలు తీశాడేకాని, ఒక్క సినిమాను కూడా కమర్షియల్‌గా లాభాల బాట పట్టించలేకపోయిన దర్శకుడ క్రిష్‌. కృష్ణ వందే జగద్గురుమ్‌ నిరాశ తరువాత మనోడు తదుపరి ప్రాజెక్టును ఇంకా ప్రకటించలేదు. ఇకపోతే మరో సెలబ్రిటీ మన కోన వెంకట్‌. ఈయన ఇప్పటివరకు రచయితగానే అందరికీ పరిచయం. అయితే హిట్టు సినిమాలకు మనోడు  పనిచేశాడనే ట్యాగ్‌ తప్పిస్తే, ఈయన రైటింగ్‌కంటూ ఒక ప్రత్యేక స్టయిల్‌ ఉన్నట్లు గుర్తించడం చాలా కష్టం. రచయితగా పనిచేసిన ఈయనకు ప్రొడక్షన్‌లో ఎటువంటి అనుభవం ఉందో ఎవ్వరికీ తెలియదు.

కాని ప్రస్తుతం క్రిష్‌, కోన వెంకట్‌లిద్దరూ అమెరికాలో తెలుగువారికి సినిమా ప్రొడక్షన్‌ ప్లానింగ్‌ గురించి క్లాసులు చెబుతున్నారట. సంవత్సరాల తరబడి సినిమాలు చేసే క్రిష్‌, కేవలం పెద్ద బడ్జెట్‌లతోనే సినిమాలు చేయగలిగే కోనలు, ప్రొడక్షన్‌ గురించి ఏం చెప్తారూ అనేది చూడాల్సిన విషయమే. అయితే ఈ వంకతో మనోళ్ళిద్దరూ తదుపరి ప్రాజెక్టుల కోసం అక్కడ ప్రొడ్యూసర్లను వెతుక్కుంటున్నారని కూడా టాక్‌ వినిపిస్తోంది. అది సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు