మహేష్‌ హ్యాండ్‌ మామూలుది కాదండోయ్‌

మహేష్‌ హ్యాండ్‌ మామూలుది కాదండోయ్‌

మహేష్‌బాబుతో చేసిన సినిమా హిట్టిచ్చి ఉండకపోవచ్చు కానీ అతని హ్యాండ్‌ మాత్రం కృతి సనన్‌కి బాగా కలిసొచ్చింది. మహేష్‌తో మొదలుపెట్టిన వేళా విశేషం కలిసి వచ్చి కృతి సనన్‌ జెండా ఇప్పుడు బాలీవుడ్‌లో రెపరెపలాడిపోతోంది. చిన్న సినిమాలతో పరిచయం అయిన హీరోయిన్లని ఎవరూ పట్టించుకోరు.

అదే మొదటి సినిమాలోనే ఒక సూపర్‌స్టార్‌తో చేస్తే వెంటనే లైమ్‌ లైట్‌లోకి వచ్చేస్తారు. తెలుగులో ఇప్పుడు కొత్తగా ఆఫర్‌ వచ్చినా సైన్‌ చేయలేనంత బిజీ అయిపోతోంది కృతి సనన్‌. ఆమె త్వరలోనే షారుక్‌ ఖాన్‌ సినిమాలో కనిపించబోతోంది. అంటే అతనికి జోడీగా కాదు కానీ వరుణ్‌ ధావన్‌ సరసన నటిస్తుందట. చెన్నయ్‌ ఎక్స్‌ప్రెస్‌తో షారుక్‌కి ఇండస్ట్రీ హిట్‌ ఇచ్చిన రోహిత్‌ షెట్టి డైరెక్ట్‌ చేస్తోన్న దిల్‌వాలేలో కృతి సనన్‌ ఛాన్స్‌ కొట్టేసింది. ఇక షారుక్‌ఖాన్‌తో మిగిలిన బాలీవుడ్‌ బిగ్‌ బాస్‌లతో జంట కట్టడమే మిగిలింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English