మహేష్‌ బేబీ ఈసారి మిస్సవ్వదంట

మహేష్‌ బేబీ ఈసారి మిస్సవ్వదంట

మహేష్‌తో మొదటి సినిమాలోనే నటించే అదృష్టం ఎంత మంది హీరోయిన్లకి దక్కుతుంది. మహేష్‌ ఛార్మ్‌ని, స్టార్‌డమ్‌ని మ్యాచ్‌ చేయాలంటే స్టార్‌ హీరోయిన్స్‌ ఉంటే తప్ప కుదరదు. అందుకే మహేష్‌తో హీరోయిన్‌ విషయంలో నిర్మాతలు కాంప్రమైజ్‌ అవ్వరు. కానీ కృతి సనన్‌ మాత్రం మొదటి చిత్రంలోనే మహేష్‌కి జంట కట్టేసి చాలా మంది హీరోయిన్ల కంటే తనే లక్కీ అనిపించుకుంది. 1 నేనొక్కడినే హిట్‌ అయిపోయి ఉంటే కృతి రేంజ్‌ ఇంకోలా ఉండేది.

కాకపోతే బాలీవుడ్‌లో దక్కిన సక్సెస్‌ని ఆమె ఎంజాయ్‌ చేస్తోందనుకోండి. తెలుగులో రెండో సినిమాలో నాగచైతన్యతో నటిస్తోంది. దోచెయ్‌ చిత్రంలో నటిస్తున్న కృతి ఈ చిత్రం చాలా అద్భుతంగా ఉంటుందని చెబుతోంది. ఇందులో ఊహించని స్క్రీన్‌ప్లే కట్టి పడేస్తుందని, సినిమా చాలా థ్రిల్‌ కలిగిస్తుందని కృతి తెలియజేసింది. సెకండ్‌ ఎటెంప్ట్‌లో సక్సెస్‌ గ్యారెంటీ అనే ధీమా ఆమెలో కనిపిస్తోంది. నాగచైతన్య హ్యాండ్‌ చాలా మంది హీరోయిన్లకి కలిసి వచ్చింది కాబట్టి కృతి కూడా దోచెయ్‌తో ఫుల్‌ బిజీ అయిపోతుందేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు