సూపర్‌ స్టార్‌కి చిరాకొచ్చేసింది

సూపర్‌ స్టార్‌కి చిరాకొచ్చేసింది

తమిళ సూపర్‌ స్టార్‌ అయినా తెలుగులో, హిందీలో కూడా స్టార్‌ డమ్‌ సంపాదించుకున్న హీరో రజనీకాంత్‌. కన్నడ, మలయాళ రంగాల్లోనూ రజనీకాంత్‌కి చాలా పాపులారిటీ ఉంది. దేశంలో ఇంకే నటుడూ తీసుకోనంత ఎక్కువ రెమ్యునరేషన్‌ తీసుకుంటాడాయన. రజనీకాంత్‌ స్టైల్‌కి ఫిదా అవని సినీ ప్రేక్షకుడు ఉండడు. లేటు వయసులో కూడా ఇండియన్‌ బాక్సాఫీస్‌కి షాకిచ్చే వసూళ్ళు సాధించిన ఘనుడు రజనీకాంత్‌. కానీ ఈ సూపర్‌ స్టార్‌ సినిమాల పట్ల వైరాగ్యం పెంచుకున్నాడట.

'లింగ' సినిమా వివాదాలతో తీవ్రంగా కలత చెందిన రజనీకాంత్‌, 'సినిమా చేద్దాం' అని ఎవరు తన వద్దకు వచ్చినా వైరాగ్యంతో కూడిన సమాధానమిస్తున్నాడట. విజయం, పరాజయాన్ని ఒకేలా తీసుకోవడం మానేసి వివాదాలతో సినిమా భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చేస్తున్నారని రజనీకాంత్‌ ఆవేదనతో రగిలిపోతున్నారట. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో విజయాలు, ఇంకెన్నో పరాజయాలు చూసిన తనకు ఏనాడూ 'లింగ'తో వచ్చిన వివాదాలు ఎదురు కాలేదనీ, కెరీర్‌ మొదట్లో ఇలాంటి వివాదాలు వచ్చి ఉంటే సినీ రంగంలో ఈ స్థాయికి ఎదిగేవాడిని కాదని రజనీకాంత్‌ అంటున్నాడట. ఈ పరిస్థితుల్లో నేనే కాదు ఎవరూ సినిమాలు చేయలేరని సూపర్‌ స్టార్‌ చెబుతుంటే, సాదా సీదా స్టార్‌ హీరోల మనోగతం ఇంకెంత దారుణంగా ఉంటుందో ఊహించుకోలేం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు