మహేష్‌ హీరోయిన్‌కి ప్రభుదేవా క్లాస్‌

మహేష్‌ హీరోయిన్‌కి ప్రభుదేవా క్లాస్‌

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ హీరోగా సుకుమార్‌ డైరెక్షన్‌లో వచ్చిన '1 నేనొక్కడినే' సినిమా హీరోయిన్‌ కృతి సనోన్‌ అందులో డాన్స్‌లు బాగానే చేసింది. క్లాసికల్‌ డాన్స్‌లో కూడా టచ్‌ ఉన్నా, తన డాన్స్‌లో ఎక్కడో ఈజ్‌ మిస్‌ అవుతోందని అనిపించి, ప్రభుదేవాతో క్లాస్‌ ఇప్పించుకుందట కృతి సనోన్‌.

అక్షయ్‌కుమార్‌ హీరోగా ప్రభుదేవా డైరెక్షన్‌లో ఓ సినిమా రానుంది. ఇందులో కృతి సనోన్‌ హీరోయిన్‌. తనను హీరోగా ఎంపిక చేసినందుకు ప్రభుదేవాకి మొదట కృతజ్ఞతలు చెప్పి, ఆ వెంటనే డాన్స్‌లో తనకు కోచింగ్‌ ఇవ్వాలని కోరింది కృతి. సోనాక్షి సహా ఎందరో బాలీవుడ్‌ హీరోయిన్లకు డాన్స్‌లలో మెలకువలు నేర్పిన ప్రభుదేవా వెంటనే ఓకే చెప్పి, కృతి సనోన్‌కి కొన్ని టిప్స్‌ ఇచ్చాడట. ప్రభుదేవా ఇచ్చిన క్లాస్‌తో తన డాన్సుల్లో చాలా ఇంప్రూవ్‌మెంట్‌ వచ్చిందని, ఈజ్‌ పెరిగిందని కృతి సనోన్‌ అంటోంది. '1 నేనొక్కడినే' తర్వాత తెలుగులో మళ్లీ కనిపించని ఈ బ్యూటీ, నాగచైతన్యతో 'దోచెయ్‌' సినిమాలో నటిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు