ఈ వయసులో ఈ గ్లామరేంటండీ బాబూ

ఈ వయసులో ఈ గ్లామరేంటండీ బాబూ

'మాస్‌', 'కింగ్‌' కాదు నాగార్జునకి సూపర్బ్‌గా యాప్ట్‌ అయిన టైటిల్‌ 'మన్మథుడు'. సినిమా వచ్చి పదేళ్ళకుపైనే అవుతుంది. కానీ నాగార్జున ఎక్కడ కనిపించినా 'మన్మథుడు' అనే పిలుస్తారు. తెలుగు సినిమాకి మన్మథుడైనా, నవ మన్మధుడైనా నాగార్జునే. అక్కినేని కుటుంబం నుంచి నాగచైతన్య హీరోగా వచ్చాడు. అఖిల్‌ హీరోగా వస్తున్నాడు. నాగ్‌, చైతూ, అఖిల్‌ ఈ ముగ్గురిలో మన్మథుడెవరంటే నాగార్జున అనే సమాధానమిస్తారు అమ్మాయిలు. 'మన్మథుడు' తర్వాత అంత యాప్ట్‌ టైటిల్‌ నాగార్జునకి 'సోగ్గాడే చిన్ని నాయనా' అంటున్నారు.

ప్రయోగాలకు ఎప్పుడూ నాగార్జున సిద్ధమే. టాలీవుడ్‌లో నాగార్జున ఎంరేజ్‌ చేసినంతగా న్యూ టాలెంట్‌ని ఇంకెవరూ ఎంకరేజ్‌ చెయ్యలేదేమో. అలా చేసిన తాజా డిఫరెంట్‌ సినిమాల్లో 'మనం' ఒకటి. 'సోగ్గాడే చిన్ని నాయనా' మూవీ కూడా ఆ కేటగిరీలోకే వెళ్తుందట. 'సోగ్గాడే..' సృష్టించబోయే సంచలనాలు ఎలా ఉన్నా 50 ప్లస్‌ సోగ్గాడికి గ్లామర్‌ పరంగా పోటీ లేదని ఈ మూవీతో ప్రూవ్‌ అయ్యేలా సినిమాలో నాగ్‌ ఇంకా గ్లామర్‌గా కన్పించనున్నాడట. ఇకపై 'మన్మథుడు' కాదు, సోగ్గాడు నాగార్జున అనాలేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు