బాలకృష్ణపై అంత కాన్ఫిడెన్స్‌ ఏంటి?

బాలకృష్ణపై అంత కాన్ఫిడెన్స్‌ ఏంటి?

బాలకృష్ణ ఈమధ్య కాలంలో 'లెజెండ్‌' తప్ప మరో హిట్‌ కొట్టలేదు. అయినప్పటికీ ఆయన తాజా చిత్రం 'లయన్‌'కి మాత్రం డిమాండ్‌ బాగా ఉంది. దీనికి దర్శకుడు కొత్తవాడైనా కానీ బాలకృష్ణ దీంతో మరో ఘన విజయం సాధిస్తాడనే ధీమా బిజినెస్‌ సర్కిల్స్‌లో వ్యక్తమవుతోంది. అందుకే ఈ చిత్రం బిజినెస్‌ భారీ స్థాయిలో జరుగుతోంది. శాటిలైట్‌ రైట్స్‌ తీసుకోవడానికి సినిమా రిలీజ్‌ వరకు వేచి చూడకుండా ఆరు కోట్ల రూపాయలకి జెమిని టీవీ సొంతం చేసుకుంది.

సీనియర్‌ హీరోల్లో సోలోగా ఇంత డిమాండ్‌ ఉన్నది బాలకృష్ణకి మాత్రమే. 'లయన్‌' ఈ సమ్మర్‌లోనే రిలీజ్‌ కానుంది. సింహా, లెజెండ్‌ రెండూ కూడా సమ్మర్‌లోనే రిలీజ్‌ అయి విజయదుందుభి మోగించాయి కనుక 'లయన్‌' కూడా ఆ సెంటిమెంట్‌ని రిపీట్‌ చేస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. ఈ చిత్రం నిండా బాలయ్య ఫాన్స్‌ ఉర్రూతలూగిపోయే పంచ్‌ డైలాగులు చాలా ఉన్నాయట. ఆడియో కూడా బ్రహ్మాండంగా వచ్చిందట. బాలయ్య వందవ చిత్రంపై నమ్మకం పెంచేలా లయన్‌ కూడా గట్టిగా గర్జిస్తుందని చెప్పుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు