గోపీచంద్‌ చెలరేగిపోతాడా?

గోపీచంద్‌ చెలరేగిపోతాడా?

'యజ్ఞం', 'రణం', 'లక్ష్యం' సినిమాలు గోపీచంద్‌ కెరీర్‌లో హిట్స్‌. వాటిని మించిన హిట్‌ 'లౌక్యం'. కొన్నాళ్లు ఫెయిల్యూర్స్‌ వెంటాడటంతో గోపీచంద్‌లో కాన్ఫిడెన్స్‌ కూడా తగ్గిపోయిందనిపించింది. 'లౌక్యం' సినిమాలో తనలోని కంప్లీట్‌ ఎనర్జీ లెవల్స్‌ని గోపీచంద్‌ బయటపెట్టలేదు. కేవలం డైరెక్టర్‌కి కావాల్సింది చేశాడంతే. హిట్టొస్తే ఎలా గోపీచంద్‌ తెరమీద చెలరేగిపోతాడో 'జిల్‌' సినిమాలో చూడొచ్చంటున్నారు.

'జిల్‌' ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ అన్నీ అల్టిమేట్‌గానే ఉన్నాయి. డైరెక్టర్‌ రాధాకృష్ణకుమార్‌ గోపీచంద్‌లోని ఎనర్జీ లెవల్స్‌ని ఫుల్‌గా వాడేశాడట. 'లౌక్యం'లో చూపించని యాక్షన్‌ ఇమేజ్‌ని 'జిల్‌'లో గోపీచంద్‌ ప్రదర్శించనున్నాడు. క్లాస్‌ టచ్‌ ఉన్న మాస్‌ క్యారెక్టర్‌ని గోపీచంద్‌ కోసమే తయారుచేసిన రాధాకృష్ణకుమార్‌, 'జిల్‌'తో గోపీచంద్‌కి కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ ఇస్తాడని ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ ద్వారా టాక్‌ స్ప్రెడ్‌ అవుతోంది. సైలెంట్‌గా వచ్చి 'లౌక్యం' పెద్ద హిట్‌ అయితే, ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌తో గోపీచంద్‌ హిట్‌ కొడితే, దాని రేంజ్‌ అలా ఇలా ఉండదు మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు