కళ్యాణ్‌కి మోక్షం ఎప్పుడో?

కళ్యాణ్‌కి మోక్షం ఎప్పుడో?

సినిమా రంగం విచిత్రమైనది. ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా ఎవరి అంచనాలకూ అందకుండా ఆగిపోతుంటుంది. ఎందుకలా అని అడిగితే సమాధానం చెప్పడమే కష్టం. సాయిధరమ్‌తేజ తొలి సినిమా కన్నా ముందు రెండో సినిమా విడుదలైంది. ఫస్ట్‌ మూవీ 'రేయ్‌' ఈ నెలాఖరున విడులవుతుందట. అట ఎందుకంటే, ఎన్నో రిలీజ్‌ డేట్స్‌ చూసిందిగాని, 'రేయ్‌' ప్రేక్షకుల ముందుకైతే రాలేదు ఇప్పటిదాకా. నాని హీరోగా ఎప్పుడో నిర్మాణం పూర్తయిన 'జెండాపై కపిరాజు' మూవీ కూడా అంతే. నితిన్‌కీ ఓ మూవీ అలాంటిదే ఉంది. అది 'కొరియర్‌ బోయ్‌ కళ్యాణ్‌'. గౌతమ్‌ మీనన్‌ నిర్మాత, ప్రేమ్‌సాయి అనే కొత్త కుర్రాడు డైరెక్టర్‌. ట్రైలర్‌ ఎప్పుడో వచ్చిందిగానీ సినిమానే ప్రేక్షకుల ముందుకు రాలేదు. 'రేయ్‌' బూజు దులిపినట్టే, 'జెండాపై కపిరాజు' బూజు కూడా దులిపారట.

'కొరియర్‌ బోయ్‌ కళ్యాణ్‌' బూజు దులుపడానికీ నితిన్‌ సిద్ధంగా ఉన్నాడని సమాచారమ్‌. అయితే వాళ్లిద్దరి మాటేమో కానీ ఇప్పుడు ఈ కొరియర్‌ డెలివరీ కావడం నితిన్‌కి మాత్రం చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు తన చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. తన తదుపరి చిత్రం ఎప్పుడు మొదలవుతుందో కూడా తనకే తెలీదు. ఈ టైమ్‌లో ఎక్కువ గ్యాప్‌ రాకుండా మధ్యలో కొరియర్‌బాయ్‌ వస్తే నితిన్‌ హ్యాపీ. కానీ అది డెలివరీ అయ్యేదెప్పుడనేది మాత్రం మిస్టరీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు