బాబు విప్పితే చూస్తారా?

బాబు విప్పితే చూస్తారా?

హీరోగా ఎలాగైనా ప్రూవ్‌ చేసుకోవాలని తపన పడుతోన్న అల్లు శిరీష్‌ 'కొత్తజంట'తో ప్రేక్షకుల్ని మెప్పించాలని అనుకున్నాడు కానీ దాని వల్ల అతనికి హీరోగా ఎలాంటి గుర్తింపు రాలేదు. మారుతి బ్రాండ్‌ వల్ల సినిమా తీసిన వాళ్లకి కాస్త లాభాలు వచ్చాయట కానీ శిరీష్‌ మాత్రం అనుకున్న ఇంపాక్ట్‌ వేయలేకపోయాడు. దాంతో ఆ సినిమా తర్వాత గ్యాప్‌ తీసేసుకున్న శిరీష్‌ ఈసారి 'సోలో' ఫేమ్‌ పరశురామ్‌ డైరెక్షన్‌లో నెక్స్‌ట్‌ మూవీ చేస్తున్నాడు.

మిగతా మెగా హీరోల మాదిరిగా డాన్సులు, గ్లామర్‌ తన బలాలు కాదు కాబట్టి ఇక ఏదైనా చేసి మెప్పించాలని కష్టపడుతున్నాడు. అందుకోసం సిక్స్‌ ప్యాక్‌ బాడీ మీద ఫోకస్‌ పెట్టాడు. తన తదుపరి చిత్రంలో చొక్కా విప్పి తన ఫిజిక్‌ చూపించబోతున్నాడు. మరి శిరీష్‌ చేసే సిక్స్‌ ప్యాక్‌ విన్యాసాలు అయినా అతడిని జనం సీరియస్‌గా తీసుకునేలా చేస్తాయో లేదో తెలీదు. అసలే మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు మార్కెట్‌లో ఉన్నారు కాబట్టి తనని పట్టించుకోవాలంటే శిరీష్‌ 'ఇంతకుమించి' కష్టపడక తప్పదు.  

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English