దమ్మాలపాటి పై ఏసిబి ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసు.. సంచలనం

ACB AP

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఏసిబి కేసు నమోదు చేసింది. అమరావతి రాజధాని ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పెద్ద ఎత్తున జరిగిందనే ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

సిట్ విచారణ చేయించాలని ప్రభుత్వం అనుకోగానే టిడిపి నేతలు కోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం ఈ విషయం కోర్టు విచారణలో ఉంది. ఇదే సమయంలో సిబిఐతో విచారణ చేయించాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ విషయమై ఇంకా కేంద్రం ఏ నిర్ణయం తీసుకోలేదు.

ఇంతలో ప్రభుత్వం గతంలో నియమించిన ఏసిబి విచారణ ఒక్కసారిగా జోరందుకుంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై అంతర్గతంగా విచారణ జరిపిన మంత్రివర్గ ఉపసంఘం ఆరోపణలకు తగ్గ ఆధారాలను కూడా సేకరించిందని తెలుస్తోంది. ఆధారాలతో టిడిపి హయాంలో ఎవరెవరు ఎంతెంత భూములు కొన్నారు ? ఏఏ గ్రామాల్లో కొన్నారు ? ఎంత ధరకు, ఎవరి పేరుపై కొన్నారు ? అనే విషయాలపై డీటైల్డ్ గా రిపోర్టిచ్చింది. ఇందులో భాగంగానే దమ్మాలపాటికి 2016, 17 సంవత్సరాల్లో కొనుగోలు చేసిన భూములు వివరాలు కూడా ఉన్నాయి.

ప్రభుత్వంలో కీలక స్ధానంలో ఉన్న దమ్మాలపాటి తన స్ధానాన్ని దుర్వినియోగం చేసి భారీ ఎత్తున భూములు కొన్నట్లు ఏసిబి ఆయనపై కేసు నమోదు చేసింది. వివిధ సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసిందంటే అరెస్టు ఖాయమని అర్ధమైపోయింది.

అయితే, అతను అక్రమ కేసులతో అరెస్టు చేయాలని చూస్తున్నారని… దమ్మాలపాటి హైకోర్టులో పిటీషన్ వేశారు. తనపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలని, ఏసిబి తనను అరెస్టు చేయకుండా ముందస్తు ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్లో కోరటం గమనార్హం.

సరే దమ్మాలపాటి పిటిషన్లో ఏమున్నా ముందైతే ఏసిబి కేసు నమోదు చేసింది. అరెస్టు సంగతే తెలియాలి. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో దమ్మాలపాటితోనే ఏసిబి కేసు నమోదు చేయటం ఆసక్తిగా మారింది. ఇది ఏపీలో కొత్త రాజకీయ కలకలానికి దారితీసింది.