బికినీ భామలు ఎక్కువయ్యారు!

బికినీ భామలు ఎక్కువయ్యారు!

బికినీ... ఇది ఎప్పుడూ హాట్ టాపిక్కే. హీరోయిన్లు ఎంత ఎక్స్ పోజ్ చేసినా, బికినీ వేయమంటే కాస్త జంకుతారు. ఉత్తరాదిని దాదాపు అందరి హీరోయిన్లూ దీన్ని ఒకసారైనా ధరించే ప్రయత్నం చేస్తారు కానీ, దక్షిణాది వారికి మాత్రం కాస్త కష్టమైన పనే అది. అయితే ఇప్పుడు ఇక్కడి వాళ్లు కూడా బికినీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తున్నారు.

తాజాగా తమన్నా ఓ సినిమాలో బికినీ వేసుకోవడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. ఈ మధ్య తమన్నాకి అవకాశాలు బాగా తగ్గిపోయాయి. దాంతో మళ్లీ తన గ్లామర్ ను చూపించి ఆకట్టుకునే ఉద్దేశంతోనే ఆమె దీనికి అంగీకరించిందని వినికిడి. ఆరెంజ్ చిత్రంలో రామ్ చరణ్ తో చెట్టాపట్టాలేసుకు తిరిగిన షాజన్ పదంశీ చాలాకాలం తర్వాత గోల్ మాల్ చిత్రంలో రామ్ సరసన నటిస్తోంది. ఈమె కూడా ఓ సన్నివేశంలో బికినీ వేయబోతోందట.

ఇక తాప్సీ. ఎన్ని సినిమాలు చేసిన అదృష్టం కలసిరాని ఈ ముద్దుగుమ్మ అయితే, బికినీ విషయంలో లారెన్స్ కి పెద్ద షాకే ఇచ్చింది. ముని ౩ స్ర్కిప్టులో మొదట బికినీ సీన్ లేదట. తర్వాత అవసరం కొద్దీ ఓ స్విమ్మింగ్ పూల్ సన్నివేశాన్ని తెరకెక్కించాల్సి వచ్చింది. అప్పుడు బికినీ వేస్తే బెటరని లారెన్స్ కు అనిపించిందట. అయితే ఇప్పటికిప్పుడు బికినీ సీన్ పెట్టామని తెలిస్తే తాప్సీ ఎలా ఫీలవుతుందోనని భయపడ్డాడట. కానీ తాప్సీ ఏమీ పట్టించుకోకుండా సింపుల్ గా ఎస్ అనేసిందట. దాంతో మనోడు కాస్త షాకయ్యాడని చిత్ర వర్గం చెబుతోంది. మొత్తానికి మన ముద్దుగుమ్మలకు బికినీ అంటే ఉన్న భయం పోయినట్టుంది!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English