మహేశ్ ఓకే అంటే... అంతే!

మహేశ్ ఓకే అంటే... అంతే!

మహేశ్ బాబు జల్సా సినిమాకి వాయిస్ ఓవర్ ఇస్తేనే జనం తెగ ఆనందపడిపోయారు. ఇక ఓ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాడంటే ఆ సినిమాకి ఎగబడరూ! అందుకే తన సినిమాలో నటించమంటూ మహేశ్ వెంటపడుతున్నాడు గుణశేఖర్. అతడు ప్రతిష్ఠాత్మకంగా తీస్తోన్న చిత్రం రుద్రమదేవి. ఇందులో భారీ తారాగణాన్ని ఎంపిక చేసుకున్నాడు గుణశేఖర్.

రుద్రమదేవిగా అనుష్కను తీసుకున్న అతడు, మిగతా ముఖ్య పాత్రల కోసం రానా, కృష్ణంరాజు, నథాలియా కౌర్, బాబా సెహగల్ వంటి వారిని ఎంచుకున్నాడు. అయితే సినిమాలో ఓ యువరాజు పాత్ర ఉందట. అది ఎక్కువసేపు ఉండదట. కానీ చాలా కీలకమైనదట. సినిమాలో ముఖ్యమైన భాగం ఆ పాత్రమీదే ఆధారపడి ఉందట. అలాంటి ఆ రోల్ ని ఎవరైనా ఫేమస్ హీరో చేస్తే బాగుంటుందని గుణశేఖర్ ఆలోచన.

అందుకే ఎవరిని తీసుకుందామా అని చిట్టా తిరగేయడం మొదలెట్టాడు. చివరికి మహేశ్ బాబు అయితే బాగుంటుందని ఫిక్సయ్యాడని సమాచారం. యువరాజు పాత్రకి మహేశ్ చక్కగా సరిపోతాడు కాబట్టి, అతడితో పని చేసిన అనుభవం తనకి ఉంది కాబట్టి మహేశ్ దగ్గరకు వెళ్లి విషయం చెప్పాడట. అయితే ప్రిన్స్ ఇంకా ఎస్ అనలేదని అంటున్నారు. ఒకవేళ ఎస్ అంటే... ఇక అంతే... ఆ సినిమా క్రేజ్ ఇంకా ఇంకా పెరిగిపోతుంది. గుణశేఖర్ ప్లానింగ్ మామూలుగా లేదు సుమీ!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు