చైతూ.. ఎక్కడున్నావమ్మా...

చైతూ.. ఎక్కడున్నావమ్మా...

మరో నాలుగు రోజుల్లో సినిమా రిలీజవుతుందంటే ఈ పాటికి టాలీవుడంతా సినిమా సందడితో టపాసులు పేలాలి, బజంత్రీలు మోగాలి. కాని నాగ చైతన్య హీరోగా వస్తున్న తడాఖా సినిమాకోసం మాత్రం ఒక్క సైరన్‌ కూడా మ్రోగడంలేదు.

నాగచైతన్య, సునీల్‌ హీరోలుగా వస్తున్న 'తడాఖా' సినిమాను ఈ నెల 10న విడుదల చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నారు నిర్మాత బెల్లంకొండ. అయితే సినిమా విడుదలకు జస్ట్‌ మూడు రోజులు మాత్రమే ఉన్నా, ఇంతవరకు ఎటువంటి ప్రమోషన్‌  కార్యక్రమం స్టార్ట్‌కాకపోవడం కాస్త విడ్డూరమే. కనీసం హీరో నాగచైతన్య అయినా ఏదో రెండు మూడు ప్రెస్‌ మీట్లు, షాప్‌ ఓపెనింగులు, పబ్లిక్‌ ఈవెంట్లు అంటూ కాస్త హడావుడి చేస్తే జనాలు సినిమా గురించి గుర్తుపెట్టుకుంటారు.

కాని కేవలం రెండు రోజుల ముందు గోడల మీద మిల్కీ బ్యూటి తమన్నా పోస్టర్లను అంటించేసి భారీ ఓపెనింగులు కావాలంటే మాత్రం కష్టమే. ఏమ్మా చైతూ వింటున్నావా...?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు