ఒక హీరో కోసం ఇద్దరు డైరెక్టర్లు!

ఒక హీరో కోసం ఇద్దరు డైరెక్టర్లు!

ఓ మోస్తరు హీరో సినిమా హిట్టయితేనే దర్శకులు అతడితో సినిమా తీయడానికి ఎగబడుతుంటారు. మరి ఏ సినిమా తీసినా హిట్టు కొట్టే సూపర్ స్టార్ విషయంలో ఎంత పోటీ ఉంటుంది! అర్థమైపోయిందా ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో! ఆ సూపర్ స్టార్ కచ్చితంగా రజనీకాంతే. రోబో తర్వాత ఆయన సినిమా ఇంతవరకూ రాలేదు. రాణా సినిమా కారణంగా అనారోగ్యంతో మంచం పట్టారు రజనీ.

చాలా గ్యాప్ తర్వాత కొచ్చాడయాన్ లో నటిస్తున్నారు. ఇది త్వరలోనే రిలీజ్ కానుంది. దాంతో తర్వాతి సినిమా కోసం ఇద్దరు డైరెక్టర్లు పోటీ పడుతున్నారు. వాళ్లేమీ సామాన్యులు కాదు. ఒకరు ఫెయిల్యూర్ ఎరుగని శంకర్. మరొకరు రజనీకి అద్భుతమైన హిట్లు ఇచ్చిన కె.ఎస్.రవికుమార్. ఈ ఇద్దరూ రజనీ డేట్స్ కోసం క్యూ కట్టారట. శంకర్ అయితే ఇప్పటికే రజనీకి ఓ కథ చెప్పేశాడు. రజనీ కూడా ఇష్టపడ్డారు. అయితే శంకర్ 'ఐ'తో పాటు, రజనీ కొచ్చాడయాన్ కూడా పూర్తయ్యాక దాని గురించి డిసైడ్ చేద్దామనుకున్నారు.

ఇంతలోనే రవికుమార్ సీన్లోకి ఎంటరయ్యాడు. నెక్స్ట్ సినిమా తానే తీస్తానంటూ రజనీ వెంటపడ్డాడు. దాంతో చాన్స్ ఎవరికివ్వాలా అని రజనీ డైలమాలో పడ్డారని సమాచారం. ఇద్దరూ గొప్ప డైరెక్టర్లే. ఇద్దరూ హిట్టు గ్యారంటీ ఇవ్వగలిగినవాళ్లే. ఎవరినీ కాదనలేరు, కాదనాల్సిన అవసరమూ లేదు. చాలా క్లిష్టమైన పరిస్థితిలో పడ్డాడు సూపర్ స్టార్. మరి చివరికి ఎవరిని వరిస్తాడో!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు