తాప్సీతో పెట్టుకుంటే పటాసే

తాప్సీతో పెట్టుకుంటే పటాసే

బబ్లీ బబ్లీగా కనిపించే తాప్సీలో కొత్త కోణం చూడాలనుకోవద్దు. ఎందుకంటే తాప్సీ పంచ్‌ ఇచ్చిందంటే పటాసే. దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అవ్వాల్సిందే. తెలుగు సినిమాల్లో సక్సెస్‌లు లేక, బాలీవుడ్‌లో వస్తున్న సక్సెస్‌లతో అక్కడఫిక్సయిపోయిన తాప్సీ, సెల్ఫ్‌ డిఫెన్స్‌లో శిక్షణ తీసుకుంది. చిన్నప్పటినుంచే తాప్సీకి టామ్‌ బాయ్‌లా మారిపోయి, ఎవర్నన్నా చితక్కొట్టేయాలనే ఆలోచనలుండేవట. కానీ ఆ వయసులో అలాంటి పనులేమీ చేయని తాప్సీ, హీరోయిన్‌ అయ్యాక ఎదుర్కొన్న కొన్ని ఘటనలతో తనను తాను రక్షించుకోవడం ముఖ్యమని తెలుసుకుని, 'క్రవ్‌ మగా' అనే ఓ పోరాట విద్యను అభ్యసించిందట కొన్నాళ్ళ క్రితం.

సినిమాల్లోనూ అవసరానికి తగ్గట్టు ఒక్కోసారి స్టంట్స్‌ చేయాల్సి వస్తుంది గనుక, తాప్సీకి ఆ నేర్చుకున్న 'క్రవ్‌ మగా' ఉపయోగపడుతుందట. తాప్సీ ముందు చూపు గురించి తెలుసుకుని బాలీవుడ్‌ హీరోలే షాక్‌ అవుతున్నారు. ఇలాంటివాటిల్లో 'మాస్టర్‌' అయిన అక్షయ్‌కుమార్‌, తాప్సీతో 'బేబీ' సెట్స్‌పై చిన్న చిన్న స్టంట్స్‌ సరదాగా చేసేవాడట. 'జాగ్రత్త నాతో ఓవర్‌ చేస్తే పంచ్‌ పడుద్ది' అనేసి, 'ఊరికినే సరదాగా అంటున్నా' అని జోక్‌ చేస్తుంది మీడియా పీపుల్‌తో తాప్సీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు