బాహుబలి కదిలాడు!

బాహుబలి కదిలాడు!

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారైంది బాహుబలి సినిమా పరిస్థితి. ఈ సినిమా గురించి ప్రకటించి కొన్ని నెలలైంది. కానీ ఇప్పటికీ సెట్స్ మీదికి వెళ్లంది లేదు. అప్పుడు ఇప్పడు అంటూ ఇప్పటిదాకా లాక్కొచ్చారు. ఈ ఆలస్యానికి అసలు కారణం రాజమౌళియే అని వినిపిస్తోంది. కథాచర్చలని కొన్నాళ్లు గడిపేశాడు. హీరో హీరోయిన్లు యుద్ధాలు, గుర్రపుస్వారీలు నేర్చుకోవాలంటూ కొన్నాళ్లు ఆపేశాడు. ఇప్పుడేమో డైలాగులు, లొకేషన్ల సెలెక్షన్ అంటున్నాడు.

ఈయన సినిమా కోసమని ప్రభాస్ తన గెటప్ మార్చుకున్నాడు. బాడీతో పాటు గడ్డం కూడా పెంచాడు. ఇది పూర్తయ్యేవరకూ వేరే సినిమా చేయడానికి లేదు. మిగతా టెక్నీషియన్స్ అంతా కూడా ఈ సినిమా కోసం కాచుక్కూచున్నారు. సినిమా ఎంతకీ మొదలు కాకపోయేసరికి వీళ్లందరికీ చిరాకు వచ్చేస్తోందట. వీళ్ల పరిస్థతి అర్థమయ్యిందో ఏమో, సినిమా షూటింగ్ గురించి ఓ క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి.

వచ్చే నెల ఆరో తేదీన షూటింగ్ మొదలుపెడతానని అంటున్నాడు. ఈ మాట వినగానే అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. కానీ అంతలోనే వాళ్ల ఆనందం మీద కొద్దిగా నీళ్లు చల్లాడు జక్కన్న. వర్షాకాలం కాబట్టి వాతావరణం అనుకూలించాలట. వర్షాలు పడకపోతే ఆ రోజు తప్పకుండా మొదలుపెట్టేస్తాను అంటున్నాడు. దాంతో మళ్లీ టెన్షన్ మొదలైంది అందరికీ. వర్షాలు పడితే ఇంకెంత కాలం సాగుతుందో సంగతి అని బెంబేలు పడుతున్నారు. ఇంతమందిని రాజమౌళి ఇలా టెన్షన్ పెట్టడం ఏమైనా బాగుందా!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English