మహేష్‌ హీరోయిన్‌కి కారు కొనిచ్చిందెవరు?

మహేష్‌ హీరోయిన్‌కి కారు కొనిచ్చిందెవరు?

'1' నేనొక్కడినే సినిమాలో నటించిన కృతి సోనన్‌ హిందీలో 'హీరోపత్ని' అనే సినిమాలో నటించింది. అల్లు అర్జున్‌, బొమ్మరిల్లు భాస్కర్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'పరుగు' సినిమాకి 'హీరోపత్ని' హిందీ రీమేక్‌. తెలుగులో కొన్ని సినిమాల్లో విలన్‌గా చేసిన జాకీ ష్రాఫ్‌ తనయుడు టైగర్‌ ష్రాఫ్‌ 'హీరోపత్ని' సినిమాలో హీరో. 'హీరోపత్ని' సినిమా చేస్తున్నప్పుడే టైగర్‌ ష్రాఫ్‌కీ, కృతి సోనన్‌కీ మధ్య ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీతోపాటు, ఆఫ్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ కూడా వర్కవుటయ్యిందనే గాసిప్స్‌ వచ్చాయి.

త్వరలో వీరిద్దరూ కలిసి నటించే ఇంకో సినిమా సెట్స్‌పైకి రానుండడం, అంతలోపే కృతి సోనన్‌ బ్రాండ్‌ న్యూ బీఎండబ్ల్యూ3 సిరీస్‌ లగ్జరీ కారుని కొనుగోలు చేయడంతో అది, టైగర్‌ ష్రాఫ్‌ గిఫ్ట్‌గా ఇచ్చాడనే గాసిప్స్‌కి రెక్కలొచ్చాయి. ఫస్ట్‌ కార్‌ కొనుక్కున్నాననే ఆనందంలో ఉన్న కృతి సోనన్‌కి ఈ గాసిప్స్‌ చికాకు కలిగిస్తున్నాయట. 'టైగర్‌ ష్రాఫ్‌ వయసూ నా వయసూ ఒక్కటే' అంటున్న కృతి, అతనితో లవ్‌ ఎలా కుదురుతుందని ప్రశ్నిస్తుంది. వయసులో తనకన్నా చిన్నవాళ్ళను పెళ్ళి చేసుకున్నవారెంతోమంది ఉన్నారు బాలీవుడ్‌లో. సో, ఎఫైర్‌తో వయసుకి సంబంధం లేదు. నమ్మేలా ఇంకో బలమైన కారణం ఏదన్నా కృతి చెబితే బెటర్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు