హేట్సాఫ్‌ సందీప్‌

హేట్సాఫ్‌ సందీప్‌

తను హీరోగా నటించిన సినిమాలోని కమెడియన్‌ గురించి పట్టిపట్టి ప్రచారం చేయడం అంటే ఆ హీరోకి ఎంతో పెద్ద మనసు ఉండాలి. కమెడియన్లతోనే కొన్ని సినిమాలు ఆడుతున్న రోజులివి. స్టార్‌ హీరోలతో సమానంగా కమెడియన్లు పెర్ఫామ్‌ చేయడం వల్లే, పెద్ద సినిమాలూ సెన్సేషనల్‌ హిట్స్‌ సాధిస్తున్నాయి. యంగ్‌ హీరోలు కూడా కమెడియన్లపై ఆధారపడాల్సి వస్తుంది. 'వెంకటాద్రి' ఎక్స్‌ప్రెస్‌ సినిమా సక్సెస్‌లో సప్తగిరి, తాగుబోతు రమేష్‌ల పాత్ర తక్కువేం కాదు. కమెడియన్ల అవసరం ఏంటో బాగా తెలిసిన యంగ్‌ హీరోల్లో సందీప్‌ కూడా ఉంటాడు.

సందీప్‌ కొత్త సినిమా 'బీరువా'. ఇందులో షకలక శంకర్‌ కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు. షకలక శంకర్‌ టీవీల్లో చేస్తున్న కామెడీ షో 'జబర్‌దస్త్‌'కి హాజరై, 'బీరువా' సినిమా సక్సెస్‌ తనకన్నా షకలక శంకర్‌కే ఎక్కువ అవసరం అని, అతనికి మంచి పేరు రావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పాడు సందీప్‌ కిషన్‌. ఆ చెప్పడంలోనూ అతని పెద్ద మనసు స్పష్టంగా అర్థమవుతుంది చూసేవారికి. స్టార్‌ డమ్‌ వస్తే, కాలర్‌ ఎగరేసే యంగ్‌ హీరోలున్న తెలుగ సినీ ఇండస్ట్రీలోనే, సక్సెస్‌తోపాటు బాధ్యతను తెలిసి ప్రవర్తించే హీరోలూ ఉన్నారు. అలాంటి బాధ్యతగల హీరోల్లో సందీప్‌ కిషన్‌ ఒకడు. హేట్సాఫ్‌ సందీప్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు