పాత ఫోటోలతో పాప హడావుడి

పాత ఫోటోలతో పాప హడావుడి

ఎప్పుడో కెరియర్‌ కొత్తల్లో నిర్మాతలకు, దర్శకులకు చూపించడానికి తీయించుకున్న ఒక ఆల్బమ్‌తో ఇప్పుడు టాలీవుడ్‌ను ఫ్లాట్‌ చేసేయాలని చూస్తోంది ఈ బెంగాళీ చిన్నది. 'ఆ ఒక్కడు' అనే సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన సెక్సీ భామ మధురిమ, ఆ తరువాత చాలా సినిమాలు చేసిందికాని అన్నీ బాక్సాఫీస్‌ దగ్గర పల్టీ కొట్టాయి.

నటిగా కాస్త తక్కువ మార్కులే వేస్తాం కాని, అమ్మడు అందాలకు మాత్రం నూటికి నూట ఇరవై మార్కులు వెయ్యాల్సిందే. ఆ మధ్యన వచ్చిన రాజశేఖర్‌ 'మహంకాళి' సినిమాలో ఒక రేంజ్‌లో రెచ్చిపోయింది. ఇక ఏ అవకాశం లేక చివరకు ఫుల్‌గా బట్టలు వేసుకొని షాడో సినిమాలో వెంకీ చెల్లెలి పాత్రలో ఏదో అలా మెరిసింది. అందుకే ఇప్పుడు  మళ్ళీ ఇండస్ట్రీలో వేడి రగిలించాలని, ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తన చేయించుకున్న బికినీ ఫోటో షూట్‌ ఒకటి ప్రజల సందర్శనార్ధం మీడియాకు పంపించింది.

ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ హాట్‌ ఫోటోస్‌ కుర్రాళ్ళను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చూద్దాం ఈ పాత ఫోటోలతో మధురిమ ఎంతమందిని తన ఇంటి వద్ద క్యూ కట్టించుకుంటుందో....

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు