'బేబీ'పై ఎటాక్‌కి రెడీ

'బేబీ'పై ఎటాక్‌కి రెడీ

సినిమా వస్తోందంటే, దానికన్నా ముందు వివాదాలు రెడీ అయిపోతున్నాయ్‌. ఏ సినిమా కూడా వివాదాల నుంచి తప్పించుకోలేకపోతుంది. పక్కా ప్లానింగ్‌తో వివాదాల మీదే కొందరు బతికేస్తున్నారనే విమర్శలెన్నో వింటున్నాం. రీసెంట్‌ టైమ్స్‌లో రజనీకాంత్‌ 'లింగ', విక్రమ్‌ 'ఐ' ఎన్ని వివాదాలు ఎదుర్కొన్నాయో చూశాం. హిందీ సినిమాల్లో 'పికె' చుట్టూ వివాదాలు వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. వివాదాలు పబ్లిసిటీకే పరిమితం కావడంలేదు. కోర్టు మెట్లు ఎక్కుతూ నిర్మాతలకు, దర్శకుడు, నటీనటులకూ తలనొప్పులూ తెచ్చిపెడుతున్నాయి.

లేటెస్ట్‌గా హిందీ మూవీ 'బేబీ'పై కూడా వివాదాలు స్టార్ట్‌ అయ్యేలా ఉన్నాయి. సినిమా స్టిల్స్‌, సినిమా యూనిట్‌ చెప్పే మాటల్ని జాగ్రత్తగా అబ్జర్వ్‌ చేస్తూ, వివాదాలు సృష్టించడానికి రెడీ అవుతున్నారట కొందరు. అక్షయ్‌కుమార్‌ హీరోగా నటించిన ఈ సినిమా, టెర్రరిజం బ్యాక్‌డ్రాప్‌లో రూపొందింది. ప్రపంచం ఎదుర్కొంటున్న పెద్ద సమస్యల్లో తీవ్రవాదం కూడా ఒకటని, భారతదేశం తీవ్రవాద పీడిత దేశాల్లో ప్రముఖమైనదని చెబుతూ, ఏ వర్గాన్నీ కించపర్చేలా సినిమా ఉండబోదని ముందస్తుగా అక్షయ్‌కుమార్‌ హామీ ఇస్తున్నాడు. వివాదాలకు జడిసే అక్షయ్‌ ఇలా అంటున్నాడని బాలీవుడ్‌ సినీ పీపుల్‌ అభిప్రాయపడ్తున్నారు. టెర్రరిజం బ్యాక్‌డ్రాప్‌లోనే వచ్చిన విజయ్‌ తమిళ్‌ మూవీ 'తుపాకీ' చాలా వివాదాలు ఎదుర్కొంది. కమల్‌ 'విశ్వరూపం' కూడా అంతే. కాబట్టి, 'బేబీ' వివాదాల నుంచి తప్పించుకుంటుందని అనుకోవడం హాస్యాస్పదమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English