సూపర్‌స్టార్‌ మనసులో ఏముంది?

సూపర్‌స్టార్‌ మనసులో ఏముంది?

'లింగా' సినిమా నష్టాలపై డిస్ట్రిబ్యూటర్స్‌ సీరియస్‌గా ఉన్నారు. వారంతా ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని బెదిరిస్తున్నా, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఇంతవరకు ఈ వివాదంపై కామెంట్‌ చేయలేదు. రజనీకాంత్‌ని కలిసినా స్పష్టమైన హామీ రాకపోవడంతోనే దీక్ష చేయాల్సి వస్తుందనే వెర్షన్‌ 'లింగా'తో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్‌ నుంచి వస్తోంది. తమిళ సినీ ఇండస్ట్రీ మద్దతు రజనీకాంత్‌కే ఉంది. రజనీకాంత్‌ 'బాబా' సినిమాతో ఇలాంటి వివాదం ఒకటి చూశాడు. డిస్ట్రిబ్యూటర్స్‌ని సంతృప్తిపరిచాడు. ఇప్పుడెందుకు రజనీకాంత్‌ పట్టించుకోవడంలేదు? అనే అనుమానం కలుగుతుంది.

'బాబా' సినిమా టైమ్‌లో పరిస్థితులు ఇప్పటికన్నా భిన్నంగా ఉండేవి. అప్పటికి అది కరెక్ట్‌, ఇప్పటికి ఇది కరెక్ట్‌ అనే ధోరణిలో రజనీకాంత్‌ ఉన్నాడట. రిలీజ్‌కి ముందు వివాదాలతో నిర్మాత నష్టపోవడంతో, నిర్మాతకు రజనీకాంత్‌ అండగా ఆ టైమ్‌లో నిలిచాడంటున్నారు. దాంతో రజనీకాంత్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ గొడవలో తలదూర్చడానికి ఇష్టపడటంలేదట. ఏదేదో ఊహించుకుని డిస్ట్రిబ్యూటర్స్‌ ఇబ్బంది పడ్డారు తప్పితే దారుణమైన నష్టాలైతే రాలేదని రజనీకాంత్‌ నోటీస్‌ చేశాడట. అందుకనే రజనీకాంత్‌ 'లింగా' వివాదంపై మౌనంగా ఉన్నాడంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు