ప్రభాస్‌కి వర్కవుట్‌ అవుద్దా?

ప్రభాస్‌కి వర్కవుట్‌ అవుద్దా?

'బాహుబలి' చిత్రానికి సంబంధించి ఎవరూ పారితోషికాలు తీసుకోవడం లేదట. పారితోషికం కూడా తీసుకుంటే ఇక ఈ చిత్రం బడ్జెట్‌ ఎప్పటికీ రికవర్‌ కానంత పెరిగిపోతుందని ఎవరికి వారు ప్రాఫిట్‌ షేరింగ్‌తో సరిపెట్టుకుంటున్నారు. ఇందులో భాగంగానే ప్రభాస్‌కి ఈ చిత్రం తమిళ వెర్షన్‌ రైట్స్‌ హోల్‌సేల్‌గా ఇచ్చేసారు. తమిళంలో కూడా ప్యారలల్‌గా నిర్మాణం జరుపుకుంటోన్న ఈ చిత్రానికి అక్కడ్నుంచి తప్పకుండా మంచి ఆఫర్‌ వచ్చి ఉండేది.

రాజమౌళి గత చిత్రం 'ఈగ' తమిళనాడులో బంపర్‌గా ఆడేసింది. కాబట్టి 'బాహుబలి'కి కూడా ఆఫర్లు బ్రహ్మాండంగా ఉండేవి. కానీ ఈ చిత్రం తమిళ రైట్స్‌ ప్రభాస్‌కి ఇచ్చేసారు. తన సొంత సంస్థ అయిన యువి క్రియేషన్స్‌ తమిళనాడులోని అగ్ర పంపిణీ సంస్థ స్టూడియో గ్రీన్‌తో కలిసి 'మహాబలి' చిత్రాన్ని మార్కెట్‌ చేస్తుంది. ఈ చిత్రం కోసం మూడేళ్ల సమయాన్ని వెచ్చించి... మిగిలిన సినిమాలన్నీ పక్కన పెట్టేసి కష్టపడిన ప్రభాస్‌కి తమిళ వెర్షన్‌తో అంతకు అంతా వర్కవుట్‌ అవుతుందో లేదో అనేది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు