650 కోట్లు.. యస్‌.. ఆరొందల యాభై కోట్లు!!!

650 కోట్లు.. యస్‌.. ఆరొందల యాభై కోట్లు!!!

'పికె' సినిమా రిలీజ్‌ అయినపుడు రాజ్‌ కుమార్‌ హిరానీ తీసిన సినిమాల్లో వీకెస్ట్‌ అని కొందరు కామెంట్‌ చేసారు. ఓ మై గాడ్‌ సినిమా నుంచి కాపీ కొట్టారంటూ కూడా విమర్శించారు. అయితే కమర్షియల్‌ విలువల కంటే కంటెంట్‌ని, ఎంటర్‌టైన్‌మెంట్‌ని నమ్ముకునే దర్శకుడు రాజు హిరానీ కష్టం వృధా కాలేదు. త్రీ ఇడియట్స్‌లాంటి ఎవర్‌గ్రీన్‌ క్లాసిక్‌ తీసిన తర్వాత అతను 'పికె' సినిమాపై అయిదేళ్ల పాటు కష్టపడ్డాడు. తన కథని డెవలప్‌ చేయడానికి ఏళ్ల తరబడి శ్రమించాడు.

అదంతా ఇప్పుడు అద్భుతంగా వర్కవుట్‌ అయి రాజ్‌ కుమార్‌ హిరానీని తిరిగి సింహాసనంపై కూర్చోబెట్టింది. త్రీ ఇడియట్స్‌ రికార్డులని గత ఏడాదిలోనే చెన్నయ్‌ ఎక్స్‌ప్రెస్‌, ధూమ్‌ 3, ఈమధ్య వచ్చిన కిక్‌ చిత్రాలు అధిగమించాయి. ఇప్పుడు వాటన్నిటికీ కొత్త బెంచ్‌మార్క్‌ని హిరాని, అమీర్‌ ద్వయం సెట్‌ చేసింది. ఇండియాలో ఈ చిత్రం ఇప్పటికి నాలుగు వందల ఎనభైౖ కోట్లకి పైగా గ్రాస్‌ వసూళ్లు సాధించింది. ఓవర్సీస్‌లో నూట అరవై కోట్ల గ్రాస్‌ కలెక్షన్‌ తెచ్చుకుంది. టోటల్‌గా దగ్గర దగ్గర ఆరు వందల కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ వసూలు చేసిన 'పికె' ఇండియాలో 335 కోట్ల నెట్‌ వసూళ్లు తెచ్చుకుని ఈ రికార్డు గురించి ఆలోచించాలన్నా కూడా మిగిలిన వాళ్లకి భయం పుట్టేలా చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు