'ఐ' ఫ్లాపయితే అంతే సంగతులు!

'ఐ' ఫ్లాపయితే అంతే సంగతులు!

'లింగ' సినిమా ఫెయిల్యూర్‌తో తమిళ సినీ డిస్ట్రిబ్యూటర్స్‌లో 'ఐ' సినిమాపై టెన్షన్‌ పెరిగిందంటున్నారు. భారీ అంచనాలతో వచ్చిన 'లింగ' సినిమాకి నాలుగో వంతు మాత్రమే వసూళ్ళు వచ్చాయని ఆరోపిస్తూ పంపిణీదారులు నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించారు. వారి ఆందోళనకు నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేష్‌ కూడా చలించిపోయాడు. సినిమా విడుదలకు ముందు నుంచీ వివాదాలతో రాక్‌లైన్‌ వెంకటేష్‌ చాలా దెబ్బతిన్నాడు. విడుదల తర్వాత గొడవలతో ఎలా స్పందించాలో తెలియడంలేదాయనకి. 'ఐ' సినిమా కూడా విడుదలకు ముందు వివాదాలతోనే నెట్టుకొచ్చేస్తోంది. 'ఐ' విడుదలకు న్యాయస్థానం బ్రేక్‌ వేయగా, వెనకాల సెటిల్‌మెంట్స్‌ చేసుకుని, 'ఐ'ని విడుదల చేస్తున్నారు.

భారీ బడ్జెట్‌తో నిర్మితమైన 'ఐ' శంకర్‌ బ్రాండ్‌తో భారీగా బిజినెస్‌ చేసుకుంది. విక్రమ్‌ కష్టం కూడా సినిమాపై అంచనాలకు పెరగడం ఖాయం. అయినప్పటికీ శంకర్‌, విజయ్‌తో రూపొందించిన 'స్నేహితుడు' అంత గొప్ప విజయం సాధించలేదు. విక్రమ్‌ కూడా కొన్ని ఫ్లాప్స్‌ ఇచ్చాడు 'అపరిచితుడు' తర్వాత. ఇలాంటివన్నీ 'ఐ' డిస్ట్రిబ్యూటర్స్‌ని ఆందోళనకు గురిచేస్తున్నాయట. అయినప్పటికి కూడా 'అపరిచితుడు'ని మించే సక్సెస్‌ శంకర్‌, విక్రమ్‌ల 'ఐ' సాధిస్తుందనే పోజిటివ్‌ ఆటిట్యూడ్‌తో కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. 'ఐ'తో విక్రమ్‌ ఏం చేస్తాడో చూడాలిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు