శాటిలైట్ రైట్స్ 'టెంపర్' లేచిపోయేలా..

శాటిలైట్ రైట్స్ 'టెంపర్' లేచిపోయేలా..

సరైన హిట్టు పడక రేసులో ఎన్టీఆర్ వెనకబడిపోతున్నాడు కానీ.. అతడికున్న క్రేజ్ తక్కువేమీ కాదు. వరుసగా ఫ్లాపులు వస్తున్నా కూడా అతడి ప్రతి సినిమాకు క్రేజ్ తక్కువేమీ ఉండట్లేదు. రామయ్యా వస్తావయ్యా, రభస సినిమాలకు కూడా విపరీతమైన హైప్ వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త సినిమా 'టెంపర్' విషయంలోనూ క్రేజ్ మామూలుగా లేదు. ముందు ఈ సినిమాపై పెద్దగా అంచనాల్లేవు కానీ.. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ రిలీజయ్యాక ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. బిజినెస్ పరంగా ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లో కొత్త రికార్డులు నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇప్పటికే శాటిలైట్ రైట్స్ కూడా రికార్డు ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ ఛానెల్ 'టెంపర్' శాటిలైట్ రైట్స్‌ని రూ.7.7 కోట్లకు కొన్నట్లు తెలిసింది. రిలీజ్‌కు ముందే శాటిలైట్ రైట్స్ కొనే సంప్రదాయం ఈ మధ్య తగ్గిపోతున్నప్పటికీ టెంపర్‌కు ఆ రేటు పెట్టారంటే ఆ సినిమా మీద ఎలాంటి అంచనాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. బండ్ల గణేష్ నిర్మాణంలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి. ఈ నెల 18న హైదరాబాద్‌లో ఆడియో వేడుక నిర్వహిస్తారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు