బలుపు ట్రిక్కులు ఫలించలేదు

బలుపు ట్రిక్కులు ఫలించలేదు

ఫ్లాపుల మీద ఫ్లాపులు అందిస్తున్న మాస్‌ రాజా రవితేజ లేటెస్ట్‌ చిత్రం 'బలుపు'. డాన్‌ శీను తీసిన గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ తాజా చిత్రం మే నెలలో విడుదల కావల్సిఉంది. అయితే సినిమా సూపర్‌గా వచ్చిందంటూ ట్రేలర్ చూపించి అమ్మేదామనుకున్న నిర్మాతల ట్రిక్కులు ఎందుకో సరిగ్గా వర్కవుట్‌ కాలేదట.

అందుకే మే లో విడుదలవ్వాల్సిన ఈ సినిమా జూన్‌కు వాయిదాపడింది. ఈ మధ్యన బాద్షా, గ్రీకువీరుడు సినిమాలను ఎక్కువ డబ్బులు పెట్టి కొనేసిన పంపిణీదారులు సినిమాలకు సూపర్‌హిట్‌ అని టాక్‌ వచ్చినాకూడా పూర్తి డబ్బులు వసూలయ్యేలా లేవని లబోదిబోమంటున్నారు. ఇలాంటి సమయంలో అసలే ఫ్లాపుల్లో ఉన్న మాస్‌ రాజా, ఇప్పుడు కేవలం ట్రేలర్ చూపించి సినిమా అమ్మాలంటే కాస్త కష్టమే.

అసలు సినిమాను ఎవరూ అవుట్‌రేట్‌కు కొనడానికి ముందుకు రావడంలేదట. షేరింగ్‌, రిటర్నబుల్‌ అడ్వాన్సు బేసిస్‌లో తీసుకుంటాం అంటున్నారట. మరి మే మిస్సయిన బలుపు, చివరకు జూన్‌లోనైనా కష్టాల నుండి గట్టెక్కుతుందా....?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు