అల్లరోడి పనైపోయిలేదట

అల్లరోడి పనైపోయిలేదట

మార్కెట్‌లో ఏ సినిమాకి జనం నుంచి స్పందన సూపర్బ్‌గా ఉంటే, ఆ సినిమాలోని సీన్స్‌ని కామెడీగా మార్చేసి తన సినిమాల్లో వాడుకోవడంలో అల్లరి నరేష్‌ దిట్ట. స్పూఫ్‌ కాన్సెప్ట్‌ని విచ్చలవిడిగా వాడుకున్న హీరోల్లో అల్లరి నరేష్‌ అందరికన్నా ముందుంటాడు. ఎప్పుడే అదే ట్రిక్‌ వర్కవుట్‌ అవదు. అందుకే అల్లరి నరేష్‌ సినిమాలు బాగా బోర్‌ కొట్టేశాయి. అలాగే, అల్లరి నరేష్‌ కామెడీకి ధీటుగా స్టార్‌ హీరోలూ ఎంటర్‌టైన్‌మెంట్‌ బాట పట్టారు. కామెడీ చెయ్యడంలో హీరోలంతా పోటీపడ్డారు. ఫలితంగా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఓ బోరింగ్‌ ఐటమ్‌ అయిపోయింది.

టైమ్‌ కలిసొస్తే ఎంటర్‌టైన్‌మెంట్‌ పండగ లేదంటే అది దండగే. స్టార్‌ హీరోలకే ఇలా ఉంటే, అల్లరోడికి ఇంకెలా ఉంటుంది? అలా అల్లరి నరేష్‌ కెరీర్‌ ప్రమాదంలో పడింది. 'బందిపోటు' సినిమాతో వినూత్న ప్రయోగం చేస్తున్నాడు అల్లరి నరేష్‌. కామెడీ చెయ్యడంలోనే కాదు, పెర్ఫామెన్స్‌ దంచేయమన్నా మనోడికి అది కొట్టిన పిండే. అల్లరి నరేష్‌ పనైపోలేదు, 'బందిపోటు'లో కెరీర్‌ బెస్ట్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చి బ్యాక్‌ ఆన్‌ టు ది సక్సెస్‌ ట్రాక్‌ అనిపించుకుంటాడని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు